ప్రేమ అంటే ఏంటో తెలియని వయసులో ప్రేమలో పడ్డారు. ఆ ప్రేమ కాస్త శారీరక సంబందంగా మారి సహజీవనం చేశారు. ఆ తర్వాత ఇరువురి పెద్దలు వీరి ప్రేమను అంగీకరించారు. అయితే మళ్లీ యువకుడు మనసు మార్చుకోని పెళ్లికి నో చెప్పడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సినిమాను మించిన ట్విస్ట్ లతో సాగిన ఈ  ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

చిత్తూరు జిల్లా బీఎన్ కండ్రిగ సమీపంలోని వరదయ్యపాళెం కు చెందిన ఓ 16 ఏళ్ల అమ్మాయి, తమిళనాడుకు చెందిన 17 ఏళ్ల యువకుడిని ప్రేమించింది. తమిళనాడులోని తన అక్క దగ్గరకు  సెలవులపై వెళ్లిన అమ్మాయి అక్కడ ఓ యువకుడిని ప్రేమించింది. అయితే వీరి ప్రేమను ఇద్దరి పెద్దలు ఒప్పుకోడంతో కొన్నాళ్లు అమ్మాయి వాళ్ల ఇంట్లోనే వున్న యువకుడు ఆమెతో సహజీవనం చేశాడు. అయితే పెద్దలు వీరికి పెళ్లి చేయాలనుకుని ముహూర్తాలు చూడటం మొదలుపెట్టారు. 

 
 అయితే ఇంతలోనే ఏమైందో ఏమోగాని ఈ అమ్మాయిని తాను పెళ్లి చేసుకోనంటూ యువకుడు మాట మార్చాడు. దీంతో ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు ఇలా మాట్లాడటంతో తట్టుకోలేక పోయిన యువతి ఆత్మహత్య ప్రయత్నించింది. ప్రాణాపాయ స్థితిలో వున్న బాలికను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది.

అయితే తన కూతురు ఆత్మహత్య చేసుకోడానికి ఈ యువకుడే కారణమంటూ యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మైనర్ బాలుడిపై కేసు నమోదు చేయడానికి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. వీరి ఇరువురికి ప్రస్తుతం కౌన్సెలింగ్ ఇచ్చి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

ఇలా చిన్న వయసులో ఆకర్షణను ప్రేమగా బావించి ఇద్దరు మైనర్లు తమ జీవితాలను నాశనం చేసుకున్నారు.