ఐదు వికెట్లు కోల్పోయిన లంక బూమ్రాకే మూడు వికెట్లు. తిరుమన్నే అర్థశతకం

ప‌ల్లేకెలె వేధిక‌గా జ‌రుగ‌తున్న మూడో వ‌న్డేలో టాస్ ఓడి ఫిల్డింగ్ కు దిగిన భార‌త్ మొద‌టి ప‌ది ఓవ‌ర్లు పూర్త‌య్యోస‌రికి 37 ప‌రుగుల‌కు రెండు వికెట్లు కోల్పోయింది. ఆ రెండు వికెట్లు భార‌త బౌల‌ర్ బూమ్రాకే ద‌క్కాయి. మొద‌టి వికెట్ గా శ్రీలంక వికెట్ కీప‌ర్‌/ ఓపెన‌ర్‌ బ‌్యా ట్స్‌మెన్ దిక్వేల్లా 13 ప‌రుగుల వ‌ద్ద వికెట్ల ముందు దొరికిపోయాడు, వ‌న్ డౌన్ లో వ‌చ్చిన మెండీస్ స్లిప్ లో రోహిత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అనంతరం చండిమాల్, తిరుమన్నే ఇరువురు కలిసి వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు, ఇద్దరు కలిసి 72 పరుగులు జోడించారు. చండిమాల్ 36 పాండ్యా బౌలింగ్ లో బూమ్రా క్యాచ్ పట్టుకున్నాడు. తరువాత బ్యాటింగ్ కి వచ్చిన మాథ్యూస్ 11 పరుగులకు కేదర్ జాదవ్ బౌలింగ్ లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. గుణతిలకే గాయంతో జట్టులోకి వచ్చిన తిరుమన్నే అర్థ శతకంతో ఆకట్టుకున్నాడు. మొదటి నుండి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోన్నాడు, చివరికి 80 పరుగుల వద్ద బూమ్రా బౌలింగ్ లో కేదర్ జాదవ్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. కెప్టెన్ కపుగేదర అక్షర్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 

43 ఓవర్లకు 178 పరుగులు చేసింది లంక.

మరిన్ని తాజా వార్తాల కోసం క్లిక్ చేయండి. 

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->టీడీపీకీ బుద్ధి చెప్పాల్సిన స‌మ‌యం ఇది