Asianet News TeluguAsianet News Telugu

ఘ‌న‌ విజ‌యం సాధించిన భార‌త్

  • భారీ విజయం సాధించిన టీం ఇండియా.
  • 304 పరుగుల తేడాతో విజయం.
  • 6 వికెట్లతో రాణించిన జడేజా.
Team india won the 1st test

శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భార‌త్‌ ఘన విజయం సాధించింది. శ్రీలంక‌లో గాలె న‌గ‌రంలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా అద్భుతంగా రాణించింది. భార‌త స్పిన్న‌ర్లు బాగా రాణించారు. 6 వికెట్లతో జడేజా రాణించగా, నాలుగు వికెట్లతో అశ్విన్ సత్తాచాటాడు. శ్రీలంక జ‌ట్టును స్పిన్న‌ర్లు ముప్పుతిప్ప‌లు పెట్టారు. మూడు టెస్టుల సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది.


మొద‌టి రోజు నుండి భార‌త్ అన్ని విభాగాల‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేసింది. తొలి ఇన్నింగ్స్ లో  శిఖర్ ధావన్, ఛటేశ్వర్ పుజారా లు సెంచరీలతో రాణించడంతో ఇండియా అత్య‌ధిక స్కోర్ చేసింది. మిడిల్ ఆర్డర్ కూడా రాణించ‌డంతో మొద‌టి ఇన్నీంగ్స్‌లో ఇండియా 600 పరుగుల భారీ స్కోరు సాధించింది.  

 మొద‌టి ఇన్నీంగ్స్ లో శ్రీలంక ప్రారంభం నుండి త‌డ‌బ‌డింది. లంక జ‌ట్టులో తరంగ 64, మాధ్యూస్ 83, పెరీరా 92 పోరాడడంతో తొలి ఇన్నింగ్స్ 291 పరుగులు చేసింది.మిగ‌తా బాట్స్‌మేన్లంద‌రు చేతులేత్తేశారు.

 అనంతరం మరోసారి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కోహ్లీ 103 సెంచరీతో చెల‌రేగాడు, అభినవ్ ముకుంద్ 81 ఆకట్టుకోవడంతో రెండో ఇన్నింగ్స్ ను 240 పరుగుల చేసింది. రెండ‌వ ఇన్నీంగ్స్ లో డిక్లేర్ ఇచ్చిన ఇండియా లంక ముందు 550 పరుగుల లక్ష్యం ఉంచింది.

 రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంకను టీమిండియా బౌలర్లు క‌ట్టుదిట్టం చేశారు. అశ్విన్, జడేజా ధాటికి లంకేయులు కేవలం 245 పరుగులకే రెండో ఇన్నింగ్స్ ముగించారు. శ్రీలంక జట్టులో కరుణ రత్నే సుదీర్ఘ ఒంటరిగా పోరాడి 97 ప‌రుగులు చేశాడు. డిక్‌ వెల్లా 67 ప‌రుగులు చేశాడు. మిగ‌తా ఆట‌గాళ్లు భార‌త బౌల‌ర్ల ముందు చేతులేత్తేశారు.  దీంతో శ్రీలంక జట్టు 304 పరుగుల తేదాతో తొలి టెస్టులో పరాజయం పాలైంది.

Follow Us:
Download App:
  • android
  • ios