భారీ విజయం సాధించిన ఇండియా. శ్రీలంక సొంత దేశంలో చిత్తుగా ఓడించిన విరాట్ సేనా. ఇన్నింగ్స్ 171 పరుగుల తేడా మూడవ టెస్టు విజయం.  క్లీన్ స్వీప్ నమోదు చేసిన ఇండియా 

శ్రీలంకతో జరుగుతున్న మూడవ టెస్టులో టీమిండియా విజ‌య దుందుభి మోగించింది. ఇండియా ఇన్నింగ్స్ 171 ప‌రుగుల తేడాతో లంక‌పై మ‌రుపురాని విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. మొద‌టి రెండు టెస్టుల్లోనూ గెలిచిన భార‌త్ చివ‌రిటెస్టులోనూ గెల‌వ‌డంతో విదేశీ గ‌డ్డ‌పై తొలిసారి టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన రికార్డును సాధించింది.


భార‌త్ 85 సంవ‌త్స‌రాల క్రికెట్ చ‌రిత్ర‌ను నేడు సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ రోజు. భార‌త్ విదేశీ గడ్డ పై భార‌త్ క్లీన్ స్వీప్ చేయ్య‌డం ఇదే మొద‌టి సారి. భార‌త్ బౌల‌ర్లు లంక బ్యాట్స్‌మెన్ల‌ను ఓ ఆట ఆడుకున్నారు. దీనితో భార‌త్‌ ఇన్నింగ్స్ 171 ప‌రుగుల తేడాతో శ్రీలంక‌ను చిత్తు చేసింది. 

మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇండియా ధావ‌న్‌, పాండ్యా శ‌త‌కాల‌తో 481 భారీ స్కోర్ చేసింది. మొద‌టి ఇన్నింగ్స్ లో 135 ప‌రుగుల‌కే అలౌట్ అయింది శ్రీలంక‌. రెండవ ఇన్నింగ్స్ ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక నిన్న‌ రెండు వికెట్లు కోల్పోయిన విష‌యం తెలిసిందే. నేడు 19/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక జట్టు భారత్ బౌలర్లు అశ్విన్ (4 వికెట్లు), మహ్మద్ షమీ (3 వికెట్లు) ధాటికి ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయారు. కేవ‌లం 181 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో అశ్విన్ 4, ష‌మీ 3, ఉమేశ్‌ యాదవ్ 2, కుల్‌దీప్ యాద‌వ్ 1 వికెట్లు ప‌డ‌గొట్టారు. 3-0 తో ఇండియా క్లీన్ స్వీప్ సాధించింది.

విదేశి గ‌డ్డ పై టెస్టుల్లో క్లీన్ స్వీప్ చేసిన మొట్ట‌మొద‌టి భార‌త‌ కెప్టెన్ గా విరాట్ కోహ్లీ రికార్డుకెక్కాడు.