Asianet News TeluguAsianet News Telugu

నాగ్‌పూర్ టెస్టులో టీం ఇండియా ఘన విజయం

  • నాగ్ పూర్ టెస్టులో టీం ఇండియా ఘన విజయం
  • లంక పై ఇన్నింగ్స్ 239 పరుగల భారీ తేడాతో విజయం
  • మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న కోహ్లీ
Team India is a great success in the Nagpur Test

నాగ్‌పూర్ లో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా ఘన విజయం సాధించింది. మ్యాచ్ లో మొదటి నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు శ్రీలంకపై ఇన్నింగ్స్ 239 పరుగుల భారీ స్కోరుతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీం ఇండియా టెస్టుల్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుని రికార్డు సృష్టించింది.

ఈ టెస్ట్ లో కొహ్లీ సేన మొదటి నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పస్ట్ ఇన్నింగ్స్ లో శ్రీలంకను 205 పరుగులకే కట్టడి చేసారు భారత బౌలర్లు. అనంతరం బ్యాటింగ్ లో టీం ఇండియా హద్దుల్లేకుండా చెలరేగింది. మొత్తం నాలుగురు బ్యాట్స్ మెన్స్ సెంచరీలతో చెలరేగడంతో లంక బౌలర్లు చేతులెత్తేశారు. కెప్టెన్ కోహ్లి (213) డబుల్ సెంచరీ చేలరేగగా, విజయ్, పుజారా, రోహిత్ లు సెంచరీలతో అదరగొట్టారు. దీంతో టీమ్ ఇండియా 6 వికెట్ల నష్టానికి 610 పరుగులు చేసింది. ఈ భారీ స్కోరు వద్ద టీం ఇండియా డిక్లేర్ చేసింది. 

తర్వాత బ్యాటింగ్ కు దిగిన లంక ఇన్నింగ్స్ ఏ దశలోను గెలుపు దిశగా సాగలేదు. మ్యాచ్ ను డ్రా చేసుకుంటే చాలన్నట్లుగా సాగింది. అయితే టీం ఇండియా బౌలర్లు రెచ్చిపోవడంతో ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇవాళ నాలుగో రోజు లంచ్ తర్వాత కాసేపటికే లంకను 166 పరుగులకే కుప్పకూల్చి విజయం అందించారు. ఈ మ్యాచ్ లో అశ్విన్ 4, ఇషాంత్, జడేజా, ఉమేష్ లు 2 వికెట్ల చొప్పున తీసుకున్నారు. తన అత్యుత్తమ బౌలింగ్ తో లంక నడ్డి విరిచిన అశ్విన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించారు. 

ఈ గెలుపుతో భారత జట్టు 3 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.తన కెరీర్‌లో ఐదో డ‌బుల్ సెంచ‌రీని నమోదు చేసి టీం ఇండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కించుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios