మరో రికార్డుకు రెండు అడుగుల దూరంలో కోహ్లీ

team india captain virat kohli  waiting for another record
Highlights

గంగూలీ రికార్డుకు అతి చేరువలో కోహ్లీ

మరో రికార్డు తన పేరిట నెలకొల్పుకోనున్న కోహ్లీ 

 

  భారత జట్టుకు అప్రతిహాత విజయాలు అందిస్తున్న డైనమిక్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు అడుగు దూరంలో ఉన్నాడు. కాదు కాదు రెండు అడుగుల దూరంలో ఉన్నాడు. టీం ఇండియా ఊపు, ప్రస్తుత ఫామ్ చూస్తుంటే కెప్టెన్ గా శ్రీలంక సిరీస్ తోనే ఆ రికార్డును అధిగమించేలా కనిపిస్తున్నాడు విజయాల వీరుడు విరాట్ కోహ్లీ. ఇతంకీ ఆ రికార్డేంటో చెప్పలేదు కదూ. అయితే ఈ కింద చదవండి.
భారత జట్టును తన సారధ్యంలో అత్యుత్తమ విజయాలు అందించిన కెప్టెన్లలో టాప్ 10 లో ఉండే వ్యక్తి సౌరబ్ గంగూలి. తన సారధ్యంలో టీం ఇండియా కు అన్ని పార్మాట్లలో చక్కటి విజయాలు అందించాడు దాదా.  అయితే అతడు నెలకొల్పిస రికార్డులు ఒక్కోటిగా బద్దలుకొడుతున్న ప్రస్తుత కెప్టెన్ సారధిగా మరో రికార్డును బద్దలుగొట్టేలా కనిపిస్తున్నాడు. 
గంగూలీ సారద్యంలో ఆడిన 49 టెస్టుల్లో టీం ఇండియా 21 విజయాలు సాధించింది. కానీ కోహ్లీ సారధ్యంలో కేవలం 29 మ్యాచుల్లోనే 19 విజయాలు సాధించింది. అంటే శ్రీలంక తో ఆడుతున్న టెస్టు సిరీస్ లో రెండు విజయాలు తన ఖాతాలో వేసుకుంటే కెప్టెన్ గా దాదా పేరిట వున్న రికార్డు బద్దలైనట్లే. టీం ఇండియా ఫామ్, కోహ్లీ సమయోచిన సారధ్యం చూస్తుంటే ఈ సిరీస్ లోనే ఈ రికార్డు బద్దలయ్యేలా కనిపిస్తుంది.   
 

loader