తమిళనాడులో జయలలిత మరణంతో రాజుకున్న రాజకీయ వేడి ఇప్పటికి చల్లారడం లేదు. ఏఐడీఎంకే పార్టీపై పట్టు కోసం ఇప్పటికే శశికళ వర్గానిరి చెందిన దినకరన్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అదే పార్టీపై పట్టుసడలకుండా ఉండేందుకు పళని, పన్నీరు వర్గాలు కూడా తమ శ్రమ వంచన లేకుండా కష్టపడుతున్నారు. అయితే  ఈ ఇరువర్గాల మద్య కోల్డ్ వార్ నిన్న మధురై విమానాశ్రయంలో బైటపడింది.  ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరుకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి. 

మధురై విమానాశ్రయంలో పన్నీరు సెల్వం, పళని స్వామి వర్గాల మధ్య  జరిగిన గొడవ తమిళ రాజకీయాలను మరోసారి వేడెక్కించింది. ఈ గొడవకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం శ్రీవల్లిపుత్తూరులో తన మనుమడి చెవి కుట్టే కార్యక్రమంలో పాల్గొనడానికి మధురై విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే అతడికి వీడ్కోలు పలకడానికి ఆయన మద్దతుదవారులు భారీగా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే సమయంలో శశికళ వర్తానికి చెందిన టిటివి దినకరన్ కూడా చెన్నై వెళ్లేందుకు అదే విమానాశ్రయాని వచ్చాడు. ఈ సమయంలో పన్నీరు వర్గం, దినకరన్ వర్గాలు ఒకరిపై ఒకరు దూషనలకు దిగారు.
 
ఈ గొడవ దూషనలతో మొదలై దాడులకు దారి తీసింది. దినకరన్ మద్దతుదారుడొకరు పన్నీర్ వర్గంపై చెప్పు విసరడంతో ఘర్షణ మొదలైంది. దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన విమానాశ్రయ భద్రతా సిబ్బంది ఇరువర్గాల నాయకులతో మద్దతుదారులకు నచ్చజెప్పించడంతో గొడవ సద్దుమణిగింది. తర్వాత పన్నీరు సెల్వం, దినకరన్ లు విమానాశ్రయంలోకి వెళ్లిపోడంతో వివాదానికి తెరపడింది.