విజయవాడలోని కంకిపాడు లో ఉన్న శ్రీ చైతన్య కళాశాలలో విషాద సంఘటన చోటుచేసుకుంది.ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్న చంద్రికా నాగమణి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 

కళాశాల క్లాస్ రూములోనే చంద్రిక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చంద్రికా నాగమణి శ్రీచైతన్య కళాశాలలో ఎంసెట్ మెడిసిన్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నది. చంద్రిక స్వస్థలం అనంతపురం జిల్లా. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. 


ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యల పరంపర కొనసాగుతుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.