ఆరు నెలల చిన్నారిని ఎత్తుకెళ్లి చంపిన ఊరకుక్క

First Published 27, Nov 2017, 11:27 AM IST
stray dog attacks kid while parents having tea at a bus stop in Nirmal district
Highlights
  • నిర్మల్ జిల్లాలో విషాద సంఘటన
  • కుక్క దాడిచేయడంతో ఆరు నెలల చిన్నారి మృతి

ఓ పసికందుపై ఊర కుక్క దాడిచేసింది. ఈ హృదయవిదారక సంఘటన నిర్మల్ జిల్లాలోని చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఏమరపాటుతో కుక్క దాడి చేసి ఆరు నెలల పసిగుడ్డును బలితీసుకుంది. 
వివరాల్లోకి వెళితే నిర్మల్ జిల్లా దివలావర్‌పూర్ మండలంలోని సిర్గాపూర్‌లో ఓ జంట వేరే గ్రామానికి వెళ్లడానికి ప్రయాణమయ్యారు. అందుకోసం వారు తమ ఆరు నెలల చిన్నారిని తీసుకుని స్థానిక బస్టాప్ కు వెళ్ళారు. అయితే వారు వెళ్లాల్సిన బస్సు ఎంతకీ రాకపోవడంతో పక్కనే ఉన్న హోటల్లో టీ తాగేందుకు వెళ్లారు. ఆ సమయంలో వారి పాప పడుకుని ఉండటంతో బస్టాప్ లోనే పడుకోబెట్టి వెళ్ళారు. దీంతో ఎలాంటి రక్షణ లేని చిన్నారిని ఓ ఊరకుక్క నోటకర్చుకుని లాక్కెళ్లింది. కుక్క లాక్కెళ్లె క్రమంలో  తీవ్ర గాయాలపాలై ఆ చిన్నారి మృతి చెందింది. తమ నిర్లక్ష్యం వల్ల కన్నబిడ్డ మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు విలపిస్తున్నారు.

loader