వావివరసలు మరిచి కామంతో కల్లుమూసుకుపోయి వరసకు కూతురయ్యే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో సవతి తండ్రి. అంతటితో ఆగకుండా తన స్నేహితులతో కూడా కూతురిని అత్యాచారం చేయించి దారుణానికి ఒడిగట్టాగడు. మళ్లీ అతడే పోలీసులకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. ఇలా బాలికపై అమానవీయంగా ప్రవర్తించి, పోలీసులను కూడా తప్పుదోవ పట్టించడానిక ప్రయత్నించి చివరకు దొరికిపోయాడు ఈ ప్రబుద్దుడు. ఈ దారుణ సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి. 

 గత ఏడాది జూన్‌లో జరిగిన ఈ ఘటన తాజాగా కోర్టు విచారణతో మరోసారి బైటికొచ్చింది. కోర్టులో అమ్మాయి తెలిపిన నిజాలను విని అందరూ షాకయ్యారు. ఈ వాంగ్మూలంలో అసలు నిజాలు బయటపడ్డాయి. హైదరాబాద్ బాలానగర్‌ ప్రాంతంలో నివసించే మాధవి భర్త చనిపోడంతో బెల్లంపల్లికి చెందిన దుర్గం మల్లేశ్‌(50)ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఈ రెండోపెళ్లికి ముందే మాధవికి 17 ఏళ్ల కూతురు ఉంది. ఈ అమ్మాయిపై సవతి తండ్రి కన్నేశాడు. భార్యకు మాయమాటలు చెప్పి ఈ బాలికను సవతి తండ్రి తన సొంతూరు బెల్లంపల్లికి తీసుకెళ్లాడు. అక్కడ  బాలికపై అత్యాచారానికి పాల్పడ్డంతో పాటు, తన స్నేహితులతో కూడా అత్యాచారం చేయించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక ఎవరికీ చెప్పలేదు.

అయితే ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకు యువతి గర్భం దాల్చింది. దీంతో మల్లేష్ మరో కొత్త ప్లాన్ కు తెరలేపాడు. తన కూతురిని ఎవరో గుర్తు తెలియని దుండగులు కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో బాగంగా బాలికను మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. బాలిక మెజిస్ట్రేట్ ముందు అసలు నిజం బైటపెట్టడంతో ఈ సవతి తండ్రి అసలు రంగు బైటపడింది. దీంతో పోలీసులు మల్లేష్ ను అరెస్ట్ చేశారు.