"రాయలసీమను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి" (వీడియో)

First Published 4, Feb 2018, 3:16 PM IST
steel plant sadana samithee  pressmeet
Highlights
  •  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డ  ప్ర‌వీణ్ కుమార్‌రెడ్డి
  •  స్టీల్ ప్లాంటు సాధ‌నే తమ లక్ష్యమని స్పష్టం చేసిన సాధన సమితి నాయకులు

 

 రాయ‌సీమ అభివృద్ధికి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు, ప్యాకేజీకి అవ‌స‌ర‌మైన ఏవిధ‌మైన ఆర్థిక తోడ్పాటు ఇవ్వ‌కుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని స్టీల్ ప్లాంటు సాధ‌నా స‌మితి అధ్య‌క్షులు జివి.ప్ర‌వీణ్ కుమార్‌రెడ్డి  అన్నారు .  మోసం చేసిన కేంద్ర ప్ర‌భుత్వాన్ని రాష్ట్రంలోని అధికార టిడిపి పార్టీ నాయ‌కులు స‌మ‌ర్థించ‌డం నీచ‌మైన చ‌ర్య అని విమ‌ర్శించారు. ఇవాళ త‌న కార్యాల‌యంలో నిర్వహించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. రాయలసీమకు స్టీలు ప్లాంటు ఇవ్వాల‌న్న ఆలోచ‌న కేంద్రానికి ఉంటే దీనిపై స్పష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసి ఉండేద‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. రాయ‌ల‌సీమ ప్ర‌జ‌ల వ‌ల‌స‌లను ఆపేందుకే తాము స్టీల్ ప్లాంటు ను డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.  స్టీల్ ప్లాంటు ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌తో ఊద‌ర‌గొట్టిన పార్టీలు, ఇక్క‌డి జ‌నాల్ని క‌సాయి వాడిక‌న్నా ఘోరంగా  మోసం చేశార‌ని విమ‌ర్శించారు.   

 రాబోయే ఎన్నిక‌ల్లో స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రాజ‌కీయ పార్టీల‌కు త‌గిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇంకా స్టీలు ప్లాంటు తెచ్చేది మేమే, ఇచ్చేది మేమే అని చెప్పుకుంటూ పోతే మీ రాయ‌ల‌సీమ బిడ్డ‌ల్ని మీరే మోసం చేసిన వార‌వుతార‌ని ఘాటుగా విమ‌ర్శించారు. ఈ సమావేశంలో స్టీల్ ప్లాంటు సాధ‌నా స‌మితి నాయ‌కులు ఎన్నెస్ ఖ‌లంద‌ర్‌, ఓబుళ‌రెడ్డి పాల్గొన్నారు.

 

వీడియో

 

loader