విజయవాడ రైల్వే స్టేషన్లో ఇవాళ డైరెక్టరేట్ అఫ్ రెవిన్యూ ఇంటలిజెన్సు అధికారుల దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వివేక్ ఎక్స్ ప్రెస్ లో అత్యంత విలువైన   407 నక్షత్ర తాబేళ్ళను తరలిస్తున్న ఇద్దరు మహిళల్ని అరెస్ట్ చేశారు. వీరు పాత బట్టల మధ్యలో ఈ తాబేళ్లను ఉంచి రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. ఈ మహిళలను అరెస్ట్ చేసిన పోలీసులు తాబేళ్లను అటవీశాఖ రేంజ్ అధికారులకు అప్పగించారు.

 ఈ మహిళలు ఈ తాబేళ్లను ఆంధ్ర ప్రదేశ్ లోని కదిరి నుండి భువనేశ్వర్ కు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ మహిళపై వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేసినట్లు, ఈ తాబేళ్ల రవాణాతో సంభందం ఉన్న మిగతావారిని కూడా గుర్తించే పనిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

 

వీడియో