కన్ఫ్యూజ్ చేస్తోన్న శ్రీనివాస్ రెడ్డి మూడో భార్య

First Published 22, Nov 2017, 1:46 PM IST
srnivas reddy third wife confused
Highlights
  • మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రెడ్డి మూడో భార్య
  • తానిక తన భర్తతో కలిసి ఉండనన్న దేవి
  • కానీ అతడు, అతడి కుటుంబసభ్యులు చాలా మంచివారని వెల్లడి
  • ఇక తాను తల్లిదండ్రుల వద్దే ఉంటానన్న దేవి

శ్రీనివాస్ రెడ్డి మూడో భార్య దేవి తన భర్త వ్యవహారంపై ఎవరికి అర్థం కాకుండా మాట్లాడుతోంది. తాను ఇక శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఉండనని చెబుతోంది. తన చదువును కొనసాగిస్తానని చెబుతున్నది. రకరకాలుగా మాట్లాడుతూ ఆమె పూర్తిగా జనాలను కన్ ఫ్యూజ్ చేస్తున్నది. ఆమె మాటలతో ఆమె కుటుంబసభ్యులే కాదు జనాలు కూడా గందరగోళంలో పడుతున్నారు. 
ఇంత గొడవ జరిగినా శ్రీనివాస్ రెడ్డి తప్పు చేయలేడని అతడికి మాట్లాడే అవకాశం ఇస్తే నిజానిజాలు తెలుస్తాయని అంటూ తన భర్తకు మద్దతుగా మాట్లాడుతున్నది దేవి. అదే సమయంలో రెండో భార్య సంగీతకు న్యాయం జరిగాలనీ తానూ కోరుకుంటున్నట్లు దేవి మీడియాకు తెలిపింది.
తన తల్లి బెదిరించడంతోనే శ్రీనివాసరెడ్డిని తాను పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నది. భవిష్యత్తలో తాను చదువును కొనసాగిస్తానని అంటున్నది. పెళ్లికి ముందు తనకు అన్ని విషయాలు తెలుసని... శ్రీనివాసరెడ్డికి ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని తెలిసే మూడో పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నది. పెళ్లి సమయంలో సంగీతకు విడాకులిస్తానని చెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్నట్లు దేవి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంటున్నది.
గొడవ జరిగింది కాబట్టి ఇక తాను తాను తన అమ్మానాన్నలతోనే ఉంటానంటూ కొత్త పల్లవి అందుకుంది. శ్రీనివాస్ రెడ్డి వద్దకు వెళ్లబోనని చెబుతున్నది. తన భర్త, కుటుంబం తనను చాలా బాగా చూసుకున్నారని వెల్లడించింది. తాను మూడు నెలల నుంచి అదే ఇంట్లో ఉంటున్నా తనపట్ల మర్యాదగానే ఉన్నారని అంటున్నది. తానేమీ ఆస్తి కోసం పెళ్లి చేసుకోలేదని, ఇప్పుడు కూడా తనకు ఎలాంటి ఆస్తి అవసరం లేదంటున్నది. 
సంగీత గొడవ జరిగినపుడు తాను అక్కడే ఉన్నట్లు చెబుతున్నది. ఆ సమయంలో సంగీత, ఆమె బందువులు తనపై కూడా దాడిచేసి గాయపర్చారని గుర్తు చేస్తున్నది. మొత్తానికి దేవి మాటలు గందరగోళంగా ఉన్న పరిస్థితి కనబడుతున్నది. దేవి మైనార్టీ తీరి ఏడాది మాత్రమే కావడం కూడా ఆ అమ్మాయికి అన్ని విషయాల్లో క్లారిటీ లేక అలా మాట్లాడుతుందని చెబుతున్నారు. 
అయితే తనకు ఇప్పుడు కూడా సంగీతపై ఎలాంటి కోపం లేదని, ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపింది దేవి.

loader