యువతిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది

First Published 12, Dec 2017, 4:40 PM IST
srikakulam love attack
Highlights
  • యువతిపై ప్రేమోన్మాది దాడి
  • ఈ తర్వాత తనను తాను పొడుచుకున్న ఉన్మాది
  • యువతి తల్లికి కూడా గాయాలు

శ్రీకాకుళం జిల్లాలో కృష్ణ అనే ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. తనను ప్రేమించాలంటూ గత కొంత కాలంగా భ్రమరాంబిక వెంట పడుతున్నాడు. అయితే ఆమె ఇతడి ప్రేమను నిరాకరించడంతో ఉన్మాదిగా మారిపోయాడు.

అయితే ఇవాళ  యువతి ఇంట్లో ఉన్న సమయంలో ఇట్లోకి చొరబడి యువతిని మరోసారి ప్రేమించాలంటూ కోరాడు. దీనికి యువతితో ఒప్పుకోకపోవడంతో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. దీనికి యువతి తల్లి అడ్డుకోవడానికి ప్రయత్నించగా ఆమెపై కూడా కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తనను తాను పొడుచుకుని ఆత్మహత్య కు ప్రయత్నించాడు.

కత్తిపోట్లకు గురైన యువతి, ఆమె తల్లిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు ఉన్మాది కృష్ణ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

loader