యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న స్మితా సబర్వాల్ సాదర స్వాగతం పలికిన ఆలయ అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని సీఎంవో అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ దర్శించుకున్నారు. యాదగిరి గుట్ట సందర్శనకు వచ్చిన ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆమె నేరుగా బాలాలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన ఆమె అర్చకులు ఆశ్విర్వచనాలు తీసుకున్నారు.
అంతే కాకుండా ఆలయ డెవలప్ మెంట్ పనులు ఎలా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈనిర్మాణాలు పూర్తయితే యాదగిరి గుట్ట దేశంలోని ప్రముఖ పుణ్యక్షేతాల్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. నిర్మాణాలు జరుగుతున్న తీరును, ప్రదాన ఆలయ పరిసరాలను పరిశీలించారు.
ఈ సంధర్భంగా ఆమె కు ఆలమ ఈవో గీత లడ్డు ప్రసాదం అందజేసారు.
