సిట్ అడిగిన ప్రశ్నలివే.. సిట్ ప్రశ్నలకు రవితేజ సమాధానాలు ఇవేనా..?
మాదక ద్రవ్యాల కేసులో సినీ ప్రముఖుల విచారణలో భాగంగా ఈ రోజు ప్రముఖ నటుడు రవితేజ ఆబ్కారీ శాఖ సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఇప్పటివరకు ఎనిమిది మంది సినీ ప్రముఖులను విచారించిన సిట్ అధికారులు తొమ్మిదో వ్యక్తిగా రవితేజను విచారిస్తున్నారు. కాగా.. రవితేజ సిట్ కార్యాలయంలోకి అడుగుపెడుతుండగానే.. సిట్ ఆయనను అడగాలని తయారు చేసుకున్న ప్రశ్నా పత్రం లీక్ అయ్యింది.ప్రస్తుతం ఆ ప్రశ్నా పత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మీకు తెలుసుకోవాలని ఉందా ఆ ప్రశ్నలేంటో..
1ప్ర.డ్రగ్స్ వాడితే ఏమొస్తుంది?
జ.కిక్
2ప్ర. పదే పదే ఎందుకు వాడతారు?
జ.కిక్ (2)
3ప్ర. డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తారు?
జ.దుబాయి శీను, డాన్ శీను
4ప్ర .ఎవరితోకలిసి డ్రగ్స్ తీసుకునేవారు?
జ.వెంకీ,చంటి, భద్ర,భగీరధ,కృష్ణ,ఆంజనేయులు,వీరా
6ప్ర .మీరు డ్రగ్స్ తో పాటు ఏమి తీసుకుంటారు?
జ.మిరపకాయ్
7ప్ర.మీకు డ్రగ్స్ ఎవరు అలవాటు చేశారు?
జ.ఇడియట్
8ప్ర.మీరు డ్రగ్స్ తీసుకుంటారని తెల్సి మీ వాళ్లు ఎలా ఫీలయ్యారు?
జ.షాక్
9ప్ర. ఈ ఫోటోలో ఉన్నవాడు ఎవడు?
జ.విక్రమార్కుడు
10ప్ర.ఇతను ఏం చేస్తుంటాడు?
జ.దొంగోడు
11ప్ర.మీ తమ్ముళ్లను చెడగొట్టింది?
జ.వీడే
12ప్ర.మీరు డ్రగ్స్ బదులు ఏమి ఇచ్చేవారు రూపాయలా డాలర్లా?
జ.నా ఆటోగ్రాఫ్
13ప్ర.పూరి, చార్మి లకు అలవాటు ఉందా?
జ.అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
14ప్ర.మీరు మొట్టమొదట డ్రగ్స్ తీసుకున్నది ఎక్కడ?
జ.బలాదూర్ నగర్లో
15ప్ర.అక్కడ ఇంకా ఎవరుండేవారు?
జ.అమ్మ.నాన్న ఓ తమిళమ్మాయి.
16ప్ర.మరి ఈ సెల్ఫీలో వాళ్లెవరు?
జ.ఒకరాజు ఒకరాణి
17ప్ర.మీరు ఇంకేమన్నా చెప్పదలచారా?
జ.నేనింతే
18ప్ర.ఇంటికెళ్లాక ఏంచేస్తారు?
జ.శంభో శివశంభో ...
(సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కొంటె ప్రశ్నలు, తుంటరి సమాధానాలు)
