ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు విడిచిన సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. అక్కాచెల్లెళ్ల లా కాకుండా స్నేహితుల్లా మెలిగే వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య కు చేసుకున్నారు. వీరి ఆత్మహత్యలతో ఆ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.   

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలం బొందిడి గ్రామానికి చెందిన ఆడె కమల్‌సింగ్, భీంసింగ్‌ అన్నదమ్ములు. వీరి కూతుళ్లు ఆడె అంజుల (18), ఆడె అర్చన (19) అక్కాచెల్లెళ్లు. వీరు అక్కాచెల్లెల్లలా కాకుండా మంచి స్నేహితుల్లా ఉండువారు. అయితే గత ఇటీవల అంజులకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు పెళ్లిసంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఓ అబ్బాయితో పెళ్లి నిశ్చయం చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఆ అబ్బాయి అంజుల నచ్చకపోడంతో తల్లిదండ్రలకు ఈ విషయాన్ని చెప్పింది. అయినా ఈమె మాట వినకుండా తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. దీంతో తీవ్ర మనస్థాపానికి లోనైన యవతి తన అక్క అర్చనను తీసుకుని ఇంట్లోంచి పారిపోయింది.

 పారిపోయిన అక్కాచెల్లెళ్లు ఆదిలాబాద్ లోని సిరికొండకు చేరుకున్నారు. ఇక్కేడే ఓ పర్టిలైజర్ షాప్ లో క్రిమిసంహారక మందు తీసుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ప్రానాపాయ స్థితిలో పడివున్న వీరిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని పోలీసులు వారిని ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అంజుల మృతి చెందగా, అర్చన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఆత్మహత్యలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.