అక్రమ ఆస్తుల కేసులోకర్ణాటక జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళకు జైళ్ల శాఖ అధికారులు షరతులతో కూడిన ఫెరోల్ మంజూరు చేసింది. ఆమె అభ్యర్థన మేరకు ఐదురోజులు ఫెరోల్ ను మంజూరు చేసినట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. తన భర్త నటరాజన్ ఆరోగ్య పరిస్థితి విషమించిన దృష్ట్యా శశికళ కు పెరోల్ మంజూరు చేస్తున్నట్లు జైళ్ల శాఖ తెలిపింది. 

షరతులు :
1. శశికళ కేవలం తన భర్త నటరాజన్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ కే పరిమితం కావాలని, లేదంటే పిటిషన్ లో పేర్కొన్న నివాసంలో మాత్రమే ఉండాలని సూచించింది.
2. అలాగే హాస్పిటల్ కు గాని. ఆమె నివాసానికి గాని వచ్చే కార్యకర్తలుగాని, బందువులతో కాని ఎలాంటి చర్చలు జరపరాదని సూచించింది.
3. అలాగే ఈ ఎమర్జెన్సీ ఫెరోల్ కాలంలో ఆమె ఎలాంటి పార్టీ కార్యక్రమాల్లో గాని, వ్యవహారాల్లో గాని, ప్రజా వ్యవహారాల్లో గాని తలదూర్చవద్దని తెలిపింది.
4. అంతే కాకుండా ప్రెస్ మీట్ లలో గాని, వార్తా పత్రికలతో గాని మాట్లాడవద్దని సూచించింది.

 

 

 మరిన్ని వార్తలు ఇక్కడ

https://goo.gl/yhm1Ku

లండన్ లో వరంగల్ స్వాతి మృతి మీద అనుమానాలు