మంత్రి జూపల్లి కృష్ణారావు కు సెర్ప్ ఉద్యోగుల షాక్

First Published 21, Nov 2017, 11:44 AM IST
serp employees strike
Highlights
  • జూపల్లి కృష్ణారావును అడ్డుకున్న సెర్ప్ ఉద్యోగులు 
  • ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
  • సానుకూలంగా  స్పందిచిన మంత్రి

గత కొన్ని రోజులుగా ఉద్యోగ భద్రత కల్పించాలని నిరసనలు చేస్తున్న సెర్ప్ ఉద్యోగులు తమ నిరసనలను  ఉదృతం చేశారు.  అందులో భాగంగా తెలంగాణ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటిని ముట్టడించారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, అలాగే వేతనాలను కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ మంత్రి ని అడ్డుకున్నారు. 
గ్రామీణ పేదరిక నిర్ములన సంస్థ ( ఇందిరా క్రాంతి పథకం) మండల , జిల్లా సమాఖ్య ఉద్యోగులు గత కొన్ని రోజులుగా తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని నిరసన కార్యక్రమాలు చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో పనిచేసే అకౌంటెంట్ , కంప్యూటర్ ఆపరేటర్ , అటెండర్ లు ఉద్యోగ భద్రత కోసం రోడ్డెక్కిన ప్రభుత్వం వీరి నిరసనలను పట్టించుకోలేదు. దీంతో వారు తమ ఉద్యమ పంథాని మార్చి డైరెక్ట్ గా మంత్రి ఇంటి వద్దే ధర్నాకు ప్లాన్ చేశారు.
అందులో భాగంగా రంగారెడ్డి  రాజేంద్రనగర్ పరిధి అత్తాపూర్ లోని గ్రామీణాభివృద్ది మంత్రి జూపల్లి ఇంటిని మట్టడించారు. అంతే కాకుండా ఇంట్లోంచి బయటకు వెళుతున్న మంత్రి వాహనాన్నిఅడ్డుకున్నారు. దీంతో మంత్రి కారు దిగి వారిని సముదాయించారు. వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి  పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు నిరసనను విరమించారు.
 

loader