ఈ పోలీస్ మీద వేటు (వీడియో)

see the behavior of rachakonda friendly police telangana
Highlights

  • మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన రాచకొండ పోలీస్ 
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు

మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన్ జవహర్ నగర్ సీ.ఐ. ఉమామహేశ్వరరావు పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. అతడిపై బదిలీ వేటు వేసి ఆ స్థానంలో జవహర్ నగర్ సీ.ఐ.గా వనస్థలిపురం డీఐ చలపతి కి అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐ ఉమామహేశ్వరరావును హైదరాబాద్ రేంజి డీఐజికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. ఇతగా మీద ఇదివరకే ఇలాంటి  ఆరోపణలున్నాయి. పోలీసు స్టేషన్ లోకి ఎవరైనా ఫిర్యాదు ఇద్దామని వస్తే వారితో ఇలాగే అమర్యాదగా ప్రవర్తించడమే కాకుండా బండ బూతులు తిడతాడని ఈ సీఐ మీద టాక్ ఉంది.

తాజా సంఘటన వివరాల్లోకి పోతే.. జవహర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ ద్వారకాపూరి కాలనీలో ఇటీవల రాజేష్ అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. రాజేష్ ని మర్డర్ చేసింది అతని దూరపు బందువు అని తెలిసింది. అయితే రాజేష్ ను హత్య చేసినట్లు భావిస్తున్న వ్యక్తి ఇంటికి మన పోలీసు సార్ పోయిండు. అప్పుడు ఇంట్లో నిందితుడు లేకపోవడంతో అతడి భార్య నుండి ఫిర్యాదు తీసుకుంటున్నాడు. ఆమె కంప్లెంట్ రాస్తుండగా ఎదురుగా కూసున్న మన సార్ బెడ్ పైన కాలు పెట్టి అనుచితంగా ప్రవర్తించాడు. 

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. పోలీసులు మహిళలను గౌరవించే పద్ధతి ఇదేనా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో ఈ సీఐ పై  వేటు వేస్తూ పెద్దసార్లు చర్యలు తీసుకున్నారు.  
 
ఈ పోలీసు తీరు ఎలా ఉందో కింద ఉన్న వీడియో లో చూడండి.

loader