పళయస్వామీ పక్క సీటు కోసం పోటీ డీప్యూటీ స్పీకర్, మంత్రి మద్య గొడవ గొడవను చూసి పగలబడి నవ్విన ప్రజలు

త‌మిళ‌నాడులో ఏం జ‌రిగిన అది దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం. ఇప్ప‌టికి అక్క‌డ రాజ‌కీయాలు ఏ క్ష‌ణం ఏం జ‌రుగుతుందో ఎవ్వ‌రికి తెలియ‌దు. నేడు త‌మిళ‌నాడు లో ఒక ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. సీఎం ప‌ళ‌నిస్వామి వాళ్ల పార్టీ స్థాప‌కుడు ఎంజీఆర్ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌లో పాల్గోన్నారు. భారీ బ‌హిరంగ స‌భ కావ‌డంతో క్యాబినేట్ మినిష్ట‌ర్లు, ఎమ్మేల్యేలు, కార్యక‌ర్త‌లు అంద‌రు హాజ‌ర‌య్యారు.

స‌భ ప్రారంభానికి ముందు అందరు త‌మకు కేటాయించి సీట్ల‌లో కూర్చుంటున్నారు. డిప్యూటి స్పీక‌ర్ జ‌య‌రామ‌న్ సీఎం ప‌క్క సీట్ లో కూర్చోవ‌డానికి వెళ్లాడు, అప్పుడు మంత్రి రాధాకృష్ణ‌న్ వ‌చ్చి ఆ సీటును లాగేసుకుని కూర్చున్నారు. అప్పుడు జ‌య‌రామ‌న్‌, ఆ మంత్రితో వాగ్వాదానికి దిగాడు. వేలాది ప్ర‌జ‌ల ముందు ఇద్ద‌రు కొంత సేపు దుర్బ‌శ‌లాడుకున్నారు. 

ఇదంతా గ‌మ‌నించిన సీఎం ప‌ళ‌నిస్వామీ వారిద్ద‌రి ద‌గ్గ‌రికి వెళ్లీ ఇరువురిని శాంతింప‌జేశారు. వారిలో మంత్రి రాధాకృష్ణ‌ను త‌న ప‌క్క‌ల కూర్చోబెట్టుకొని, డిప్యూటి స్పీక‌ర్ జ‌య‌రామ‌న్‌ను మ‌రో సీటులో కూర్చోబెట్టారు. అక్క‌డ ఉన్న జ‌నాలు ఈ సీన్ ను చూసి ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుకున్నారు.