కృష్ణా  జిల్లా కంచికచర్ల రవీంద్ర భారతి పాఠశాల లో దారుణం జరిగింది. తరగతి గదిలో నవ్వినందుకు ఓ లెక్కల మాస్టార్  7 వ తరగతి చదువుతున్న పి. వెంకట్ నంద అనే విద్యార్ధిని చితకబాదాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. దీనికి కారణమైన ఉపాద్యాయుడిపై  ప్రిన్సిపాల్ కు పిర్యాదు చేస్తే, అతడు కూడా టీచర్ నే సమర్ధించినట్లు బాలుడి తండ్రి పాలడుగు రాధాకృష్ణ తెలిపాడు. దీంతో ఏం చేయాలో తెలీక మీడియాను ఆశ్రయించినట్లు అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకును ఇంతలా గాయపర్చిన ఆ టీచర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపాడు.