ఫీజు కోసం ఈ చిన్నారులను స్కూల్ యాజమాన్యం ఏం చేసిందంటే (వీడియో)
- విద్యార్థులను బంధించిన వరంగల్ లోని ఓ కార్పోరేట్ స్కూల్
- ఫీజు వసూళ్ల కోసం అమానుషం
ముక్కుపచ్చలారని చిన్నారులను స్కూల్ ఫీజుల కోసం బంధించిన ఓ కార్పోరేట్ స్కూల్ యాజమాన్యం బాగోతం వరంగల్ జిల్లాలో బైటపడింది. వరంగల్ పట్టణ శివారులోని కరీమాబాద్ లో గల వరంగల్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఫీజు కట్టలేదంటూ చిన్నారులను స్కూల్ యాజమాన్యం ఓ గదిలో బంధించింది. ఇలా యూకేజి నుండి 10 వ తరగతి వరకు గల ఫీజు కట్టని విద్యార్థులను క్లాస్ రూంలకు వెళ్లనీయకుండా రోజంతా ఓ గదిలో పెట్టారు. ఇలా పిల్లలపై అమానుషంగా ప్రవర్తించిన యాజమాన్యంపై తల్లిదండ్రులు ఆగట్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు కట్టాలని తమకు సమాచారం ఇవ్వకుండానే స్కూల్ సిబ్బంది ఇలా ప్రవర్తించడం బాగాలేదని, దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.
వీడియో