ఎస్‌బిఐ మ‌రో షాక్ ఇచ్చింది

SBI gave to another shock for holders
Highlights

  • 4 శాతం నుండి 3.5 శాతానికి తగ్గించిన వడ్డి.
  • కోటి పైన డిపాజిట్ ఉంటేనే 4 శాతం
  • నేటి నుండి అమలు.

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త‌మ వినియోగదారులకు మ‌రో షాక్ ఇచ్చింది. సేవింగ్స్ అకౌంట్లపై వ‌డ్డీ రేటును త‌గ్గించింది. గ‌తంలో ఉన్న వ‌డ్డీ కంటే 0.5 శాతం త‌గ్గించింది. ఈ కొత్త వ‌డ్డీ రేట్లు నేటి నుండే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. కోటి వ‌ర‌కు ఉన్న సేవింగ్స్ డిపాజిట్ల‌పై గ‌తంలో 4 శాతం వ‌డ్డీ ఇవ్వగా, ప్రస్తుతం దాన్ని 3.5 శాతానికి త‌గ్గించింది.


కోటికి పైగా డ‌బ్బును జ‌మ చేసుకున్న ముదుప‌ర్ల‌కు మాత్రమే 4 శాత‌మే వ‌డ్డీని ఇవ్వ‌నుందని తెలుస్తోంది. ద్రవ్యోల్బ‌ణ రేటు త‌గ్గ‌డం వ‌ల్లే వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన‌ట్లు ఎస్‌బిఐ ఉన్నతాధికారులు వెల్ల‌డించారు. సేవింగ్స్ ఖాతా వ‌డ్డీ రేటును తగ్గించామ‌ని ప్ర‌క‌టించ‌గానే ఎస్‌బిఐ షేర్ల ధ‌ర ఏకంగా 4.75 శాతం పెర‌గ‌డం విశేషం. ఇప్ప‌టికే ట‌ర్మ్ డిపాజిట్ల‌పై కూడా 0.5 శాతం వ‌డ్డీ రేటును ఎస్‌బిఐ తగ్గించిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది బ్యాంకు ఖాతాధారులు, కోటి పైగా ఉన్న అకౌంట్ల‌కు మాత్ర‌మే అంటే ఇది ధ‌నికులకు మాత్రమే వ‌ర్థిస్తుంద‌ని, సాధార‌ణ ముదుప‌ర్ల‌కు ఎస్‌బీఐ మొండి చేయి చూపించిన‌ట్ల‌యిందని వాపోతున్నారు. 
 

loader