కేసీఆర్ ఇక్కడ దేవుడు - వైసిపి ఎమ్మెల్యే

First Published 14, Nov 2017, 4:22 PM IST
santhanuthalapadu mla suresh appriciates telangana cm kcr
Highlights
  • సీఎం కేసీఆర్ పై ప్రశంసలు కురిపించిన వైసిపి ఎమ్మెల్యే
  • తెలంగాణ అసెంబ్లీ లో ప్రతిపక్షం వీక్ గా ఉందన్న ఎమ్మెల్యే
  • అదే ఎపిలో ప్రతిపక్షం బలంగా ఉందన్న సురేష్ 

తెలంగాణ లో శీతాకాల పమావేశాలను కూడా ఇంత సుదీర్ఘంగా జరుపుతున్న కేసీఆర్ నిజంగా దేవుడేనని అంటూ ఆంధ్రప్రదేశ్  వైసిపి ఎమ్మెల్యే సురేష్ ఆకాశానికెత్తారు. ఇక్కడ శీతాకాల సమావేశానికే ఇన్ని రోజులు కేటాయిస్తే, ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను కూడా పట్టుమని 14 రోజులు దాటనివ్వరని ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన తెలంగాణ అసెంబ్లీ వద్దకు వచ్చిన ఆయన అక్కడ    మీడియాతో ముచ్చటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపద్యంలో    ఈ రెండు అసెంబ్లీలను పోల్చుతూ మాట్లాడారు.
అసలు ఏపీలో  అసెంబ్లీకి వెళ్లడమే టైం వృధా అని,అసలు ప్రతిపక్షాలు మాట్లాడేందుకు కనీసం 5 నిమిషాల టైం అయినా ఇవ్వకుండా మైక్ కట్ చేస్తారని అన్నారు. అదే తెలంగాణ లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు స్వేచ్చగా మాట్లాడే అవకాశం తెలంగాణ అసెంబ్లీలో ఉంది. ఇలా పాలకపక్షం, ప్రతిపక్షాలు కలిసి చక్కగా సమావేశాలు పాగిస్తున్నారని అన్నారు.
అయితే తెలంగాణ లో ప్రతిపక్ష కాంగ్రెస్ చాలా వీక్ ఉంది. కేసీఆర్ వారికి ఇంత సమయం ఇస్తున్నా వారు సద్వినియోగం చేసుకోలేక పోతున్నారు. అదే ఆంధ్రాలో అన్నిటిని తట్టుకుని వైసీపీ బలమైన ప్రతిపక్షం గా నిలబడుతోందని అన్నారు. 
ఈ విధంగా కెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలను పోలుస్తూనే.  తెలంగాణలో ప్రభుత్వాన్ని పొగిడి ప్రతిపక్షాలను విమర్శించారు. అదే విధంగా ఎపిలో ప్రతిపక్షాన్ని పొగిడి పాలక పక్షాన్ని విమర్శించారు సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్. 
 

loader