పాపం.. హైదరాబాద్ సంగీత

First Published 19, Dec 2017, 4:33 PM IST
sangeetha continues is strike
Highlights
  • నేటికీ కొనసాగుతున్న సంగీత దీక్ష
  • తనకు న్యాయం జరగేవరకు కొనసాగిస్తానని స్పష్టం

 

 

భర్త పులకండ్ల శ్రీనివాసరెడ్డి చేతిలో దారుణంగా దాడికి గురై, అతడి ఇంటిముందే భార్య సంగీత దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ దీక్ష ఇవాళ్టికి నెలరోజులకు చేరుకుంది. దీనిపై సంగీత స్పందిస్తూ...నెల రోజులుగా దీక్ష చేస్తున్నప్పటికి తనకు న్యాయం జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనతో పాటు తన కూతురికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన నాయకులెవరు ఇపుడు ఇటువైపు తొంగి చూడటం లేదని తెలిపింది.

 అలాగే మొదట్లో ఈమె దీక్షకు మద్దతుగా పాల్గొన్న మహిళా సంఘాలు కూడా మెల్లమెల్లగా దీక్షాస్థలానికి రావడం మానివేయడంతో కొంత మంది కుటుంబ సభ్యులతో కలిసి సంగీత తన దీక్షను కొనసాగిస్తోంది.

ఆడపిల్ల పుట్టిందన్న కారణంతో బార్యను ఇంట్లోంచి తరిమేసి రెండో పెళ్లి చేసుకున్నాడు టీఆర్ఎస్ యూత్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి. ఇదేమిటని ప్రశ్నించిన భార్య సంగీతను చితకబాదాడు. అయితే ఆమెను చితకబాదుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, భర్తను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తనకు, తనకు కూతురికి న్యాయం కావాలంటూ సంగీత బోడుప్పల్ లోని భర్త ఇంటిముందు దీక్షకు దిగింది. ఆమె దీక్షకు మహిళా సంఘాలు, స్థానికులు మద్దతుగా నిలిచారు.

సంగీత దీక్షకు మద్దతు తెలిపిన స్థానిక ఎంపి మల్లారెడ్డి ఈ వ్యవహారంలో మద్యవర్తిగా వ్యవహరించారు. జైళ్లోని సంగీత భర్తతో పాటు, అత్తామామలతో చర్చలుమ జరిపిన ఆయన సంగీత కు న్యాయం చేయడానికి ప్రయత్నించాడు. అయినా ఆ రాయభారం ఫలితాలివ్వలేదు. ఇక జేఏసి చైర్మన్ కోదండరాం కూడా సంగీతను పరామర్శించి ఆమెకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని సూచించారు. ఇలా మహిళా సంఘాలు.,  రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచినప్పటికి సంగీతకు న్యాయం జరగలేదు. 

తాను కోరుకున్నట్లు అత్తామామలు, భర్త నుంచి తనకు తగిన హామీ వస్తేగాని దీక్ష విరమించేది లేదని సంగీత తెగేసి చేబుతోంది. అయితే ఇంత జరిగినా ఇప్పటికీ సంగీతపై కోపంతోనే ఉన్నమామ బాల్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడే గాని ఆమెకు అన్యాయం చేయమని మాత్రం హామీ ఇస్తలేడు. దీంతో సంగీత గత నెల రోజులుగా భర్త ఇంటిముందు దీక్ష కొనసాగిస్తూనే ఉంది. 

 

loader