సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నుండి సంగారెడ్డి వైపు వెళుతున్న ఆర్టీసి బస్సు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కంది సమీపంలో హైదరాబాద్ ఐఐటీ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరికొంత మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.  

ప్రమాదంపై సమాచారం అందుకున్న సంగారెడ్డి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా సంగారెడ్డి వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో వెంకట్, నరేందర్, నాగరాజు, మహేశ్వర్, వెంకట్ రెడ్డి ఉన్నారు.గాయపడిన వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో