Asianet News TeluguAsianet News Telugu

ఇవాంకా ట్రంప్ కు రాయల్ వెల్ కమ్

  • ఇవాంక ట్రంప్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు 
  • ఆమెకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పడానికి ఫలక్ నుమా ప్యాలస్ వర్గాల ఏర్పాటు
  • ప్యాలస్ లో ప్రధాని ఇచ్చేవిందులో పాల్గొననున్న ఇవాంక
Royal WelCome to the Ivanka Trump

అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ కు వస్తున్న అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ కు రాయల్ వెల్ కమ్ పలకడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తాజ్ ఫలక్ నుమాలో ఆమెకు విందు ఇవ్వనున్నారు. దీనికోసం ఆమెను రాజసాంప్రదాయంతో ఆహ్వానించాలని ఫలక్ నుమా ప్యాలెస్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకోసం ఓ గుర్రపు బగ్గీని రెడీ చేస్తున్నారు సిబ్బంది.

ఈ నెల చివర్లో హైదరాబాద్ లో జరగనున్న పారిశ్రామిక సదస్సు 2017లో ఇవాంక ట్రంప్ తో పాటు వివిధ దేశాల ప్రతినిదులు పాల్గొననున్నారు. అందుకోసం నగరాన్ని సర్వాంగ సుందరంగా తయారుచేశారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ తో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. అందుకోసం నిర్వహకులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే అంతర్జాతీయ ప్రతినిధుల కోసం ఇప్పటికే వసతి, భద్రత ఏర్పాట్లు పూర్తయ్యాయి.

అయితే ఈ సదస్సుకోసం మొదటిసారి ఇండియాకు(హైదరాబాద్) వస్తున్న ఇవాంక ట్రంప్ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం తాజ్ పలక్ నుమాలో జరిగే విందులో ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని,అందుకోసం గుర్రపు బగ్గీని రెడీ చేస్తున్నారు.  అందులో ఆమెను కూర్చోబెట్టి ప్యాలెస్ లోకి తీసుకెళ్లాలని హోటల్ వర్గాలు ప్లాన్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా దేశ యువరాణికి ఇలా స్వాగతం పలికి ఆమె మెప్పు పొందాలని ప్యాలెస్ సిబ్బంది బావిస్తున్నారు.
 
 

Follow Us:
Download App:
  • android
  • ios