అధికార టీఆర్ఎస్ పార్టీలో అధికార పోరు మరీ ఎక్కువయిందని, ఈ అధికారదాహంతో కేసీఆర్, కేటీఆర్ లు కలిసి హరీష్  చంపడం ఖాయమని అన్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే హరీష్ ను చంపడానికి తండ్రి కొడుకులు మహూర్తం కూడా పెట్టుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా టీఆర్ఎస్ లోనే ఉంటే హరీష్ రాజకీయంగా  చంపడం ఖాయమని అందుకే ఆ పార్టీని వీడాలంటూ రేవంత్ సూచించారు.

 తామంతా నిప్పు అని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులపై ప్రతిపక్ష నేతల మీద తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో హరీశ్‌రావు చర్చలు జరిపారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేసేందుకు... వైఎస్‌ సన్నిహితుడితో హరీశ్‌రావు చర్చలు జరిపారని,  వైఎస్ మరణంతో ఆచర్చలు ఆగిపోయాయని గుర్తు చేశారు. ఇపుడు మళ్లీ అమిత్‌షాను కలిసిన హరీశ్‌ జంపింగ్ ప్లాన్ చేశారని తెలిపారు.

వీడియో