ఇవాళ పార్లమెంట్ లో ప్రధాని చేసిన ప్రసంగం చౌకబారుగా ఉందని అన్నారు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.  కాంగ్రెస్ పార్టీ రాష్ట్నానికి ఏం చేసిందన్న ప్రధాని ప్రశ్నకు రేవంత్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. రాజీవ్ గాంధీ  అవమానించాడని చెప్పిన అంజయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో ఉత్పన్నమైన సమస్యలు తీర్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. పరిపాలన,నీటి పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాల మద్య సయోద్య కుదిర్చే ఒక్క ప్రయత్నమైనా చేసిందా అని అన్నారు. విభజన అమలు విషయంలో ఇద్దరు ముఖ్య మంత్రుల ను కూర్చో బెట్టి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడంలేదని అన్నారు. తెలంగాణ విభజన కోసం బిల్లు ప్రవేశ పెట్టే సమయంలో పార్లమెంట్ తలుపులు మూసి ఆమోదించి అవమానించారని చెబుతున్న ప్రధానికి, ఏ బిల్లయినా ఓటింగ్ కి వచ్చే సమయంలో పార్లమెంటు తలుపులు మూసి ఆమోదిస్తారని తెలియదా అని ప్రశ్నించారు. ప్రధానికి ఇంత చిన్న విషయం తెలియక పోవడం శోచనీయంగా ఉందన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఆమెకు తెలంగాణ ప్రజలు రుణపడిఉంటారని రేవంత్ రెడ్డి అన్నాడు.

కేంద్రంలో మోదీ , రాష్ట్రంలో కేసీఆర్ లు బడా చోర్ ,చోటా చోర్ లుగా తయారయ్యారని విమర్శించారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవ్ రెడ్డి .అంజయ్య ,పీవీ లను రాష్ట్రపతి ,సీఎం ,పీఎం లను చేసింది కాంగ్రెసే అని మరిచి మోదీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తిరుపతిలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పటివరకు ఇవ్వకుండా సాక్షాత్తు వెంకన్నకే ప్రధాని శఠగోపం పెట్టారన్నారు.  అద్వానీ ,వాజ్ పేయీ లాంటి సీనియర్ నేతలను అణిచివేస్తూ, అవమానిస్తున్న మోదీ తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.  రాజస్థాన్ ఫలితాలతో  మోడీ చెలరేగిన ఆందోళననే  ఈ స్పీచ్ లో కనబడిందని రేవంత్ అన్నారు. 

తెలంగాణ బిల్లు పై వెకిలిగా మాట్లాడడమంటే రాజ్యాంగాన్ని అవమానపర్చడమే. ఈవిషయంలో ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపనచెప్పాలని రేవంత్ సూచించారు.ఇలా మాట్లాడిన బీజేపీ పార్టీ జెండా...తెలంగాణాలో ఉండేందుకు గానీ ఎగిరెందుకు గానీ వీల్లేదని అన్నారు. ప్రధాని అయిన నాలుగేళ్లలో మోదీ తెలంగాణకు ఏం చేశారో చెప్పి అప్పుడు ఇవన్నీ మాట్లాడాలని విమర్శించారు రేవంత్ రెడ్డి.