మీరు ఆ పని చేస్తేనే  పదవులా : రేవంత్ (వీడియో)

revanth reddy fires on kcr family
Highlights

  • తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్న రేవంత్
  • కేసీఆర్ కుటుంబానికి అన్ని పదవులేలా వచ్చాయో చెప్పిన రేవంత్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలొస్తాయని భావించి యువత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే వారి ఉద్యోగాల మాట అటుంచింతే కేసీఆర్ కుటుంబంలో మాత్రం నలుగురికి ఉద్యోగాలొచ్చాయని ఎద్దేవా చేశాడు. ఈ విషయాన్నే వారికి అడిగితే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు మాకీ పదవులు వచ్చాయని అంటారు. అంటే మీరు బతుకమ్మ లాడితేనో, రోడ్లపై కూర్చుని ధర్నాలు చేస్తేనో, ప్రసంగాలు చేస్తేనో మీకు సీఎం, మంత్రులు, ఎంపి పదవులు వస్తే తమ ప్రాణాలను పనంగా పెట్టి ఉద్యమానికి ఊపిరి పోసిన అమరుల కుటుంబాలకు ఎన్ని పదవులు రావాలని ప్రశ్నించారు. ఇలా అమరుల త్యాగాల ఫలితమే తెలంగాణ కానీ కేసీఆర్ కుటుంబం ఉద్యమంలో చేసిందేమీ లేదని రేవంత్ విమర్శించారు. తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరం యూఎస్ఎ ఆద్వరయంలో జరిగిన 5వ ప్రవాసి తెలంగాణ దివాస్ లో పాల్గొన్న రేవంత్ కేసీఆర్ ప్రభుత్వం, కుటుంబంపై విరుచుకుపడ్డారు. 

అమరులను తెలంగాణ ప్రభుత్వం ఎలా విస్మరిస్తుందో చెప్పిన రేవంత్ 

 

 

loader