కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి తో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పార్టీలో రేవంత్ స్థానం తో పాటు, కాంగ్రెస్ ఉపాద్యక్షుడు రాహుల్ గాంధీ సభపై వీరు ప్రదానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. ఇటీవల భారీ బలగంతో పార్టీలో చేరిన రేవంత్ కు కాంగ్రెస్ అధిష్టానం పార్టీలో సముచిత పదవి కట్టబెడతామని హామీ ఇచ్చినట్లు, అందుకోసమే కుంతియా రేవంత్ ఇంటికి చేరుకుని చర్చిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా రాహుల్ తెలంగాణ పర్యటన,వరంగల్ సభ ఏర్పాట్లపై కూడా ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సభకు పార్టీ తరపున ఏర్పాటు చేసే కార్యక్రమాలు, జన సమీకరణ తదితర అంశాలను చర్చిస్తున్నారు.
కానీ తెలంగాణలో ఇంత మంది సీనియర్లుండగా కుంతియా నేరుగా రేవంత్ ఇంటికి వెళ్లడం. రాహుల్ సభపై చర్చంచడం చర్చనీయంగా మారింది. అంటే పార్టీలో చేరిన రేవంత్ కు మంచి స్థానమే ఉందనే సంకేతాలను అతడి అభిమానులకు పంపించడంతో పాటు, దీన్ని చూపించి ఇతర పార్టీ నాయకులను ఆకర్షించాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అతాగే రేవంత్ తో పాటు కాంగ్రెస్ లో చేరిన నాయకులకు నమ్మం కల్గించి వారిలో గూడుకట్టుకున్న అనుమానాలను పటాపంచలు చేయాలన్న ఉద్దేశ్యంతో కుంతియా నేరుగా రేవంత్ ను కలిసినట్లు సమాచారం.