రేణుకకు కాంగ్రెస్ షాక్ ?

రేణుకకు కాంగ్రెస్ షాక్ ?

రాజ్యసభ సభ్యురాలు, ఏఐసిసి అధికారప్రతినిధి రేణుకాచౌదరికి ఏఐసిసి అధిఫ్టానం షాక్ ఇచ్చిందా? పార్టీ నేతలు చెబుతున్నదాని ప్రకారమైతే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో ఏఐసిసి రేణుకకు షాక్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే, పార్టీ అధిష్టానంకు సంబంధం లేకుండా రాజ్యసభ సభ్యురాలు కొన్ని పనులు చేసిందట. దాన్ని అధిష్ఠానం ‘అతిగా’ భావించిందట. అందుకే గతంలో ఉన్నంత ప్రాధానత ఇపుడు ఇవ్వటం లేదని పార్టీ నేతల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇంతకీ జరిగిందేమిటంటే, ఆమధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధి వేసుకన్న జాకెట్ (జర్కిన్) బాగా వివాదాస్పదదమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ వివాదంలో అధికార ప్రతినిధి హోదాలో రేణుక కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కాస్త బాగా వివాదాస్పదమయ్యాయి. దాంతో రాహూల్ ఆగ్రహానికి గురయ్యారట.

అంతేకాకుండా మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత యశ్వంత్ సిన్హా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ‘మంచ్’ కార్యక్రమంలో పాల్గొన్నారట. ఐఏసిసి అనుమతి లేకుండానే మంచ్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. దానికితోడు ఖమ్మం జిల్లా డిసిసి కార్యవర్గం ఉండగా దానికి సమాంతరంగా ఓక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయించారట. తెలంగాణా మొత్తం మీద అటువంటి టాస్క్ ఫోర్స్ అన్నదే లేదు.

జిల్లాకు డిసిసి కార్యవర్గం ఉండగా ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ అవసరం ఏంటని జిల్లా నేతలు నేరుగా ఏఐసిసికి ఫిర్యాదు చేశారట. దాంతో అదికూడా బాగా వివాదాస్పదమైంది. అప్పటికే రేణుక వ్యవహారశైలిపై జిల్లా నేతల నుండి కుప్పలు తెప్పలుగా సోనియా, రాహూల్ వద్ద ఫిర్యాదులున్నాయి. ఇటువంటి అనేక కారణాలతో రేణుక ప్రాధాన్యతను తగ్గించేస్తూ రాహూల్ అంతర్గతంగా ఆదేశాలు జారీ చేశారట. దాంతో రేణుక రెక్కలను కత్తిరించేసినట్లైంది. దానికితోడు రేణుకు త్వరలో పార్టీకి దూరమయ్యే యోచనలో కూడా ఉన్నారని జిల్లాలో బాగా ప్రచారమవుతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో?

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Home Page

Next page