పెళ్లి జరగడం లేదన్న మనస్థాపంతో ఓ యువకుడు సెల్పీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. నిశ్చితార్థం జరిగి రెండేళ్లు గడుస్తున్నా పెద్దలు పెళ్లి చేయకపోవడంతో ఈ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కారణాలు చెబుతూ సెల్ ఫోన్ లో సూసైడ్ వీడియోను సెల్పీ తీసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విదంగా ఉన్నాయి.

రాజస్థాన్‌కు చెందిన జశ్వంత్‌ సింగ్‌(20) బతుకుదెరువు కోసం హైదరాబాద్ కు వలస వచ్చి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు షాహినాథ్ గంజ్‌ లో నివాసముంటున్నాడు. అయితే జశ్వంత్ కు రాజస్థాన్‌కే చెందిన ఓ అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ నిశ్చితార్థం జరిగి రెండు సంవత్సరాలు గడుస్తున్నా పెద్దలు పెళ్లి చేయకపోవడంతో ఇతడు మనోవేధనకు గురయ్యాడు.  మానసికంగా కుంగిపోయిన జశ్వంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతడు ఆత్మహత్య సమయంలో తీసిన సెల్పీ వీడియో ఆదారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సమాచారం.