Asianet News TeluguAsianet News Telugu

పీఎస్‌ఎల్వీ-సీ 39 వైఫ‌ల్యానికి కార‌ణం ఇదే

  • పీఎస్‌ఎల్వీ-సీ 39 వైఫ‌ల్యానికి కార‌ణం అధిక బరువే.
  • ఉండాల్సిన బరువు కన్న టన్ను బరువు పెరిగింది. 
  • అందుకే నిర్ణీత వేగంతో కక్ష్యలోకి దూసుకెళ్లలేదు.
PSLV C39 fail because of this

పీఎస్‌ఎల్వీ-సీ 39 వైఫ‌ల్యానికి కార‌ణం అధిక బ‌రువేనా. అంటే అవున‌నే అంటున్నారు ఇస్రో శాటిలైట్‌ సెంటర్‌ మాజీ డైరెక్టర్‌ శివకుమార్‌. నెల్లూరు శ్రీహారి కోట నుండి ఇస్రో ప్ర‌యోగించిన పీఎస్‌ఎల్వీ-సీ 39 ప్ర‌యోగించి విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. నావిగేష‌న్ వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేయడానికి దీనిని ప్ర‌యోగించారు. అయితే ఆ ప్రయోగం విఫలం కావడానికి కారణం అధిక బరువని ఆయ‌న వివ‌ర‌ణ ఇచ్చారు. 

 "ఐఆర్‌ఎన్‌ఎస్ఎస్ -1హెచ్‌" ఉపగ్రహ ప్రయోగం విఫలం కావడం కొంత బాధ‌క‌రం అన్నారు. వంద‌లాది మంది శాస్త్ర‌వేత్త‌లు సంవ‌త్స‌రాల పాటు క‌ష్ట‌ప‌డ్డార‌ని ఆయ‌న తెలిపారు. అధిక బరువు కారణంగా ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టే క్రమంలో పీఎస్‌ఎల్వీ నిర్ణీత వేగంతో ప్రయాణించలేకపోయింద‌న్నారు. ఉప‌గ్ర‌హం ఉండాల్సిన దానిక‌న్న‌ సుమారు టన్ను బరువు పెరిగిందని ఆయన తెలిపారు. రాకెట్ గరిష్టంగా 20,650 కిలోమీటర్ల దూరంలోని వ్య‌తిరేక‌ కక్ష్యలోకి దూసుకెళ్లాల్సి ఉండగా, అధిక బరువు కారణంగా కేవలం ఆరు వేల కిలో మీటర్ల దూరం మాత్రమే వెళ్లగలిగిందని ఆయన పేర్కొన్నారు. రాకెట్ లోని అన్ని దశల ఇంజన్లు సక్రమంగానే పని చేశాయని చెప్పిన ఆయన, ఉష్ణకవచం మాత్రం వేరుపడలేదని తెలిపారు. ఇక మీద‌ట ఇస్రో ఇలాంటి విష‌యాల‌పై మ‌రింత జాగ్ర‌త్త వ‌హించాల‌ని ఆయ‌న సూచించారు.
 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి.. 

 

Follow Us:
Download App:
  • android
  • ios