ప్రధాని హైదరాబాద్ పర్యటన షైడ్యూల్ విడుదల 28 వ తేదీన 2.30pm నుంచి 9.30pm వరకు హైదరాబాద్ లో ప్రధాని
మెట్రో ప్రారంభోత్సవంతో పాటు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానితో పాటు అంతర్జాతీయ జాతీయ ప్రముఖులు నగరానికి వస్తున్నందున తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రత తో పాటు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంధర్భంగా ప్రధాని పర్యటన షెడ్యూల్ ను పీఎంవో విడుదల చేసింది. అతడి పర్యటన క్రింది విధంగా సాగనుంది.
ఈ నెల 28 తేదీన మద్యాహ్నం 2.30 గంటలకు మోదీ ప్రత్యేక విమానంలో బేగంపేట కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక హెలి క్యాప్టర్ లో మియాపూర్ కు చేరుకుంటారు.
3.00 - 3.25pm మెట్రో రైలు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అందులో భాగంగా మెట్రో రైల్ ఫైలాన్ ఆవిష్కరిస్తారు.
అనంతరం మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్లనున్నారు. 4 గంటలకు హెచ్ఐసీసీలో గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటారు.
7.30pm హెచ్ఐసీసీ నుంచి రోడ్డు మార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్ కు చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక అతిథి ఇవాంక, సీఎం కేసీఆర్ లతో పాటు మరికొంత మంది ప్రముఖులతో విందులో పాల్గొంటారు.
పలక్ నుమా ప్యాలెస్ నుంచి 8.45pm కు బయలుదేరి 9.30pm కు బేగంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో డిల్లీకి వెళ్లనున్నారు.
