దొంగతనానికి విమానంలో వస్తాడు.. ఎదురు తిరిగితే తుపాకీతో బెదిరిస్తాడు.

నగరంలో దొంగతనాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఇక్కడ ఉన్న దొంగలు చాలదన్నంటూ దిల్లీ నుంచి వచ్చి మరీ ఓ దొంగ దొంగతనాలకు పాల్పడుతన్నాడు. అందులోనూ ఆ దొంగ.. దిల్లీ నుంచి హైదరాబాద్ కి విమానంలో మాత్రమే వస్తాడట. వివరాల్లోకి వెళితే.. దిల్లీ కి చెందిన సల్మాన్ అలియాస్ దంత్ తుటా.ఇతను దొంగతనం చేయడానికి ఎంచుకున్న నగరానికి విమానంలోనే వస్తాడు. తన ముఠా సభ్యులను మాత్రం రైల్లో తుపాకీతో రమ్మంటాడు. అనుచరులతో కలిసి స్నాచింగ్ కి పాల్పడే క్రమంలో మహిళలు ప్రతిఘటిస్తే వారిని తుపాకీతో బెదిరిస్తాడు.ఇలా తన ముఠాతో కలిసి ఇప్పటిదాకా 30 నగరాల్లో దొంగతనానికి పాల్పడ్డాడు.

ఇటీవల ఓ చోట దొంగతనానికి పాల్పడుతూ సల్మాన్ పోలీసులకు చిక్కాడు. అతని వద్ద నుంచి తుపాకీ, రెండు లైవ్ కాట్రిడ్జ్ లు, మూడు బంగారు గొలుసులు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. గత కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ లో దొంగతనానికి పాల్పడి.. అనంతరం దిల్లీ పారిపోగా.. అక్కడ పోలీసులకు చిక్కాడు. ఇప్పటికే ఇతనిపై 19 కేసులు నమోదైనట్లు పోలీసులు చెప్పారు.