మెట్రో ప్రారంభోత్సవంపై క్లారిటీ ఇచ్చిన పీఎంవో

మెట్రో ప్రారంభోత్సవంపై  క్లారిటీ ఇచ్చిన పీఎంవో

హైదరాబాద్ మెట్రో ప్రారంభంపై పూర్తి క్లారిటీ వచ్చింది. ఈ ప్రారంభోత్సవంపై ఇప్పటివరకు పలు అనుమానాలున్నా తాజాగా పీఎంవో తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారంతో అవన్నీ పటాపంచలయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌ పర్యటన షెడ్యూల్ ఖరారయింది. అందులో మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు ఉండటంతో ఇక మెట్రో పరుగులకు అడ్డే లేదని ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ప్రజలు భావిస్తున్నారు.
ఇప్పటికే సీఎంఆర్ఎస్ మెట్రో భద్రత పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చంది. ఇప్పుడు పీఎంవో కూడా ప్రధాని పర్యటనపై  స్పష్టతనిచ్చింది. అధికారిక సమాచారం ప్రకారం ప్రధాని మోదీ ఈ నెల 28న ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.ఆయనతో పాటు కొందరు కేంద్ర మంత్రులు కూడా రానున్నారు. అక్కడ ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ మంత్రులు   స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మెట్రో ప్రారంభ స్థలమైన మియాపూర్ కు చేరుకుంటారు. అక్కడ మెట్రో ఫైలాన్ ను ప్రారంభించి మియాపూర్ నుంచి ఎస్సార్ నగర్ లేదా అమీర్ పేట్ వరకు ప్రయాణించనున్నారు.అక్కడి నుంచి మళ్లీ మెట్రోలోనే మియాపూర్‌కు చేరుకుని స్టేషన్‌ ఆవరణలో జరిగే ఛాయాచిత్ర ప్రదర్శనలో పాల్గొంటారు. అనంతరం అక్కడిని నుంచి అంతర్జాతీయ  సదస్సులో పాల్గొనడానికి వెళతారు.
 ఈ విధంగా పలుమార్లు వాయిదాల అనంతరం ఎట్టకేలకు మెట్రో పరుగులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ కొన్ని స్టేషన్లలో తుది దశ పనులు జరుగుతున్నా, ప్రారంభ సమయానికల్లా అన్నీ సిద్దం అవుతాయనా మెట్రో అధికారులు చెబుతున్నారు.
 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos