సాధారణంగా సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది కొడి పందేలు. కానీ హైకోర్టుతో పాటు, ఏపి ప్రభుత్వం ఈ కోడి పందేలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో అనంతపూర్ ఎంపి జేసి దివాకర్ రెడ్డి కొత్త రకం పందేలకు తెరలేపారు. తన స్వస్థలం తాడిపత్రి లో కోడి పందేలకు బదులు వినూత్నంగా పందుల పందేలను ఏర్పాటు చేశారు. ఈ పందేలను చూడటానికి జిల్లా ప్రజలే కాదు పక్క జిల్లాల ప్రజలు కూడా తరలివచ్చారు. మహబూబ్ నగర్, గద్వాల్, హిందూపురం, కళ్యాణదుర్గం, కడప, బేతంచెర్ల, తదితర ప్రాంతాల నుంచి దాదాపు 40 మంది పందెం కోసం పందులను తీసుకుని వచ్చారు. ఈ పోటీల్లో పందుల మద్య హోరాహోరి పోటీ జరిగింది.  

ఈ పందేలను జేసి దివాకకర్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా ప్రజలను కంట్రోల్ చేస్తూ కర్ర చేత పట్టుకుని హల్ చల్ చేశారు జేసి. ఈ పందుల పోటీలను, జేసి హల్ చల్ ని కింది వీడియోలో చూడండి.