సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరీంనగర్ లోని కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయానికి బయలుదేరారు. జనసేన ముఖ్యులు, అభిమాన సంఘాల్లోని ముఖ్యులు వెంటరాగా దాదాపు 50 వాహనాల్లో పవన్ దేవాలయానికి బయలుదేరారు.

 

 

 

జనసేన కార్యాలయం నుండి పవన్ కాన్వాయ్ బయలేదేరింది. మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో దేవాలయంలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత జనసేన ముఖ్యులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తారు.

ఇంటి వద్ద పవన్ భార్య లెజినోవా సంప్రదాయబద్దంగా హారతి ఇచ్చారు. అనంతరం జనసేన మహిళా విభాగంకు చెందిన నేతలు పవన్ కు వీరకంకణం కట్టారు.