ముందుగానే ప్రకటించినట్లుగా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

మధ్యాహ్నం 1.30 గంటలకు సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ముందుగానే ప్రకటించినట్లుగా కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. 50 వాహనాలతో హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉదయం బయలుదేరిన పవన్ కాన్వాయ్ మధ్యాహ్నానికి కొండగట్టుకు చేరుకున్నది. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పవన్ తెలంగాణాలోని కరీంనగర్ తో జనయాత్రను ప్రారంభిస్తున్నారు. దేవాలయానికి వచ్చిన పవన్ కు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

నాలుగు రోజుల తెలంగాణా పర్యటనకు పవన్ కరీనంగర్ జిల్లా నుండే శ్రీకారం చుడతారు. పవన్ వచ్చే ముందే దేవాలయం వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు చేరుకున్నారు. వాహనం దిగిన పవన్ ను సెక్యూరిటీ సిబ్బంది అతికష్టం మీద ఆలయంలోకి తీసుకెళ్ళారు. పవన్ తో పాటు జనసేన ముఖ్యులు మాత్రమే ఆలయంలోకి వెళ్ళారు. దేవాలయంలో ప్రత్యేక పూజల తర్వాత జనసేన కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. తర్వాత కరీంనగర్ కు చేరుకుని రాత్రికి అక్కడే బసచేస్తారు.

Scroll to load tweet…

భారతదేశానికి పవనే ముఖ్యమంత్రి 

పవన్ అభిమానులు భారీ సంఖ్యలో దేవాలయానికి చేరుకున్నారు. ఉదయం నుండే అబిమానులు ఆలయం చుట్టుపక్కలకు చేరుకున్నారు. తమ అభిమాన నటుడిని దగ్గర నుండ చూసేందుకు అభిమానులు గంటల పాటు వేచి ఉన్నారు. మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు పవన్ ఆలయం దగ్గరకు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు.

Scroll to load tweet…

పవన్ ను దగ్గర నుండి చూసేందుకు పోటీ పడటంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. పోలీసులు అతికష్టం మీద అభిమానులను నియంత్రించగలిగారు. కాబోయే సిఎం పవన్ అంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. పవన్ కు ఏపిలోనే కాదని తెలంగాణాలో కూడా అభిమానులున్నారంటూ అరుపులు కేకలతో తెలియజేశారు. అదే ఊపులు భారతదేశానికి పవనే కాబోయే సిఎం అంటూ నినాదాలివ్వటం గమనార్హం.