జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తన రాజకీయయాత్రను ప్రారంభించినట్లే ఉన్నారు. ఎందుంకటే, ఆదివారం ఓ చర్చిలో ప్రార్ధనలకు హాజరవ్వటం ద్వారా తన ఆలోచనలేంటో చాటి చెప్పినట్లైంది. కరీంనగర్ లోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత తన రాజకీయ యాత్రను ప్రారంభిస్తానని పవన్ శనివారం ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి అందరకీ తెలిసిందే. అందులో భాగంగానే ఈరోజు  సర్వమత ప్రార్ధనల్లో భాగంగా చర్చికి వెళ్ళారు.

సెయింట్ మేరీస్ చర్చిలో పవన్ కల్యాణ్ దంపతులు ఉదయం ప్రార్థనలు జరిపారు. అంతుకుముందు పోలాండ్ బ్రాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీ పవన్ కల్యాణ్‌ను జనసేన కార్యాలయంలో కలిశారు. అలాగే పోలాండ్‌కు చెందిన మరో 20 మంది విద్యార్థులు కూడా పవన్‌ను కలిశారు.

ఈ సందర్భంగా వీరందరూ కలిసి సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. ఎప్పుడైతే పవన్ చర్చ్ కు వచ్చారని తెలిసిందో వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేశారు.అభిమానులను కంట్రోల్ చేయటం పోలీసులకు కష్టమైపోయింది.