ప్రభుత్వ మెడికల్ కళశాల నిర్వాకం మెరిటల్ స్టెటస్ పైన విచిత్రమై ప్రశ్నలు మండిపడ్డ సిబ్బంది.
పైన అడిన ప్రశ్నలు ఎవరైనా ఎవరినైనా అడిగితే ఎలా ఉంటుంది. అడిగినవాడికి మూడుతుంది.. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఒక ప్రభుత్వ మెడికల్ కళశాలలో ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలపాలని తమ ఉద్యోగుల పత్రాలను పంచారు.
వివరాల్లోకి వస్తే బిహార్ రాజధాని పాట్నాలో ఉన్న ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒక విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఆ కళశాలలో పనిచేసే ఉద్యోగులును తమ పెళ్లికి సంబంధించిన వివరాలు కోరింది. అయితే ఫారమ్‌లో పేర్కొన్న ప్రశ్నలు అందరికీ మతి పొగొట్టాయి. మారిటల్ స్టేటస్ డిక్లరేషన్‌లో.. మీకు భార్యలు ఎంతమంది? వితంతువు ను పెళ్లి చేసుకున్నారా..? పెళ్లై భార్య చనిపోయిన వ్యక్తిని పెళ్లిచేసుకున్నారా అని ? ఇలాంటి పలు విచిత్ర ప్రశ్నలు ఉన్నాయి.
దీంతో ఈ చెత్త ప్రశ్నలేంటి అని ఉద్యోగులు ఉన్నతాధికారులను నిలదీశారు. అంతేకాదు సదరు ఫారమ్‌ను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైరల్ అయింది.
తక్షణమే స్పందించిన ఆ కళశాల యజమాన్యం ఇది మేము చెయ్యలేదని, ఎవరో కావాలని తమ కళాశాల ముద్రను ఉంచి ఇలా కావాలని సర్కులేట్ చేశారని తెలిపారు.
