ఇన్నాళ్లు భార‌త్ పై క‌య్యానికి కాలు దువ్విన పాక్ తీరులో మార్పు వ‌చ్చిందా..! పాకిస్తాన్‌, భార‌త్ తో శాంతిని కోరుకుంటుందా..!. ప‌రిస్థితి చూస్తే అలాగే అనిపిస్తుంది. అందుకు కార‌ణం భార‌త్ తో పాక్ చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మ‌ని తెలప‌డం. ఇప్పుడు ఇదే విష‌యం ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌కు దారితీస్తుంది. 

Image result for india vs pakistan flag

భార‌త్, పాక్ మ‌ధ్య గొడ‌వ‌లు చాలా కాలం నుండి జ‌రుగుతున్నాయి. ప్ర‌ధాన కార‌ణం కాశ్మీర్ అంశం. ఇండియా, పాకిస్థాన్  దేశాల మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కాశ్మీర్ అంశమే కీలకం. అయితే పాక్ ఇండియాతో చ‌ర్చ‌ల‌కు ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఇరు దేశాల మ‌ధ్య శాంతి కోరుకుంటున్న‌ట్లు ఆ దేశ విదేశాంగం మంత్రి ఖావాజా ఆసిఫ్ తెలిపారు. కాశ్మీర్ అంశం పై చ‌ర్చ‌ల ద్వారా ఒక ప‌రిష్కారానికి వ‌ద్దామ‌ని ఆయ‌న తెలిపారు.

Image result for pak minister khawaja

 ప్ర‌పంచంలో అన్ని దేశాల‌తో తాము శాంతియుతంగా ఉండాల‌నుకుంటున్నాం, అందుకు అన్ని ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. ముఖ్యంగా భార‌త్ తో త‌మ‌కున్న గొడ‌వ‌ల‌ను ప‌రిష్క‌రించాల‌నుకుంటున్నాం అని ఖావాజా తెలిపారు. న‌వాజ్ ష‌రీఫ్ రాజీనామా త‌రువాత‌ షాహిద్ ఖకాన్ అబ్బాసీ పాక్ ప్రధానిగా భాద్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న ప‌దివిలోకి రాగానే ఇండియా తో చ‌ర్చ‌ల‌కు సిద్ద‌మ‌ని తెలిపారు. అబ్బాసీ ప్ర‌స్తుతం పాక్ తాత్కాలిక ప్ర‌ధానికిగా కొన‌సాగుతున్నారు. త్వ‌ర‌లో పాకిస్తాన్ ముస్లీం లీగ్ పార్టీ నుండే ముహమ్మద్ షెబజ్ షరీఫ్ ప్ర‌ధానిగా భాద్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. 

Image result for new pak prime minister shahid abbasi
కానీ అబ్బాసీ రాగానే ఇండియా తో చ‌ర్చ‌ల‌ను సిద్ద‌మ‌ని తెలప‌డం పాక్ వైఖరిలో మార్పు వ‌చ్చిందా అంటే అవున‌నే అనిపిస్తుంది. అంద‌కు సాక్ష్యం పాక్ క్యాబినేట్ లో హిందూవుల‌కు చోటు క‌ల్పించ‌డం. 20 సంవ‌త్స‌రాల్లో ఇలా జ‌ర‌గ‌డం ఇదే మొద‌టి సారి. దీనిని బ‌ట్టి చూస్తే పాక్ భార‌త్ తో శాంతి కోరుకుంటుంద‌ని విదేశాంగం మంత్రి ఖావాజా మాట‌ల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ఆయన మ‌రో మాట కూడా అన్నారు భార‌త్ కాశ్మీర్ పై చ‌ర్చ‌ల‌కు క‌లిసి రావాల‌ని మేము ఎదురుచూస్తున్నామని ఆయ‌న తెలిపారు. 

Image result for kashmir maps
అయితే ఈ విష‌యం పై భార‌త్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.


విశ్లేష‌కులు

కానీ ఇండియా విశ్లేష‌కులు మాత్రం పాక్ ప్ర‌తిపాదన‌ను మ‌రో విధంగా ప‌రిగ‌ణిస్తున్నారు. పాక్ ప్ర‌పంచ దృష్టిని ఆక‌ర్షించ‌డానికి మాత్ర‌మే భార‌త్ ను చ‌ర్చ‌లకు ఆహ్వానిస్తుందని, అస్స‌లు ఆ దేశానికి భార‌త్ తో చ‌ర్చ‌ల జ‌రిపే ఉద్దేశ్యం ఏనాడు లేద‌ని అంటున్నారు. గ‌తంలో కూడా అట‌ల్ బీహార్ వాజ్‌పేయ్ ప్ర‌ధానిగా ఉన్నప్పుడు జ‌రిగిన విష‌యాన్ని ప్ర‌స్త‌ావిస్తున్నారు. ఆనాడు కూడా భార‌త ప్ర‌ధానమంత్రి వాజ్ పేయ్ ని పిలిచి శాంతి ఓప్పందాలు కుద‌ర్చుకున్న కొద్ది కాలానికే పాక్‌ కార్గిల్ యుద్దం ప్రారంభించింద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.


పాక్ క్యాబినేట్ లో హిందువులకి చోటు క‌ల్పించ‌డానికి కూడా కార‌ణాలు ఉన్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. పాకిస్తాన్‌ కు వ్య‌తిరేకంగా బ‌లోచిస్తాన్‌, ఆఫ్ఘానిస్తాన్ లు ఇప్ప‌టికే ప‌లు ప్ర‌క‌ట‌న‌లు చేశాయి. ఆ ప్రాంతాల‌కు ద‌గ్గ‌ర‌వ్వ‌డానికి పాక్ క్యాబినేట్ లోకి హిందువును తీసుకున్నార‌ని వాళ్లు తెలుపుతున్నారు. పాక్ ఏనాడు భార‌త్ తో సంబంధాల‌ను కోరుకొద‌ని, ఒకవేళ అలా కాకుండా ముందుకు వ‌స్తే అది అహ్వానించ‌ద‌గ్గ‌ ప‌రిణామం అని విశ్లేష‌కులు అంటున్నారు.