అవమానించిన ఒప్పో కంపెనీ యాజమాన్యం ఆగ్రహించిన పంజాబ్ యూనిట్ ఉద్యోగులు ఉద్యోగాలకు రాజీనామా

 ప్రముఖ చైనా మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ ‘ఒప్పో’ పంజాబ్‌ యూనిట్‌లో ఒకేసారి ఉద్యోగులంతా రాజీనామా పత్రాలు సమర్పించారు.
జీతాలు పెంచాలని కంపెనీని కోరితే భారతీయులను అవమానపరిచేలా ...‘భారతీయులంతా బిచ్చగాళ్లు’ అని ఒప్పో యాజమాన్యం
వ్యాఖ్యలు చేసిందని వారు పేర్కొన్నారు. ఈ కారణంగానే తామంతా రాజీనామా పత్రాలు సమర్పించినట్లు ఉద్యోగులు తెలిపారు. కాగా ఈ
వ్యవహారమంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ అంశంపై ఒప్పో కంపెనీ స్పందించింది. అధికారిక ప్రకటనను విడుదల
చేసింది. రెండు వర్గాల మధ్య సమాచార లోపం వల్ల ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది. పంజాబ్‌ యూనిట్‌లో జరిగిన ఘటన గురించి
తమకు తెలుసని.. జులై 15న ఈ ఘటన జరిగితే 16న సమస్య పరిష్కారమైందని కంపెనీ చెప్పింది. రెండు వర్గాల మధ్య సమాచారలోపం
వల్లే ఈ సమస్య తలెత్తిందని, ఏకాభిప్రాయం కుదిరి ఉద్యోగులంతా తిరిగి విధుల్లోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని వారు చెప్పారు .
భారత్‌ అంటే మాకు ఎంతో గౌరవమని.. ఆ దేశ సంస్కృతి, మా ఉద్యోగులను ఎంతో గౌరవిస్తామని, భవిష్యత్‌లో ఇలాంటివి జరగకుండా
చూస్తాం’ అని కంపెనీ హామీ ఇచ్చింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred