ఓల్డ్ మాంక్ ప్రియులకు చేదువార్త

First Published 9, Jan 2018, 3:48 PM IST
Old Mank creator Mohan passes away
Highlights
  • ఓల్డ్ మాంక్ మోహన్ కన్నుమూత
  • గుండె పోటుతో మృతి

ప్రముఖ లిక్కర్ కింగ్, డార్క్ రమ్ ఓల్డ్ మాంక్ సృష్టికర్త బ్రిగేడియర్ కపిల్ మోహన్ కన్నుమూశారు. ఈనెల 6 వతేదీనే ఆయన తుది శ్వాస విడిచినప్పటికి ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లోని ఆయన సొంత నివాసంలోనే  మోహన్ గుండె పోటుతో మృతి చెందారు.

మోహన్ ను ప్రముఖ వ్యాపార వేత్తగా కంటే లిక్కర్ కింగ్ గానే ఎక్కువగా గుర్తింపు పొందారు. అయితే ఈ లిక్కర్ వ్యాపారంలోనే కాదు చక్కెర, వస్త్ర పరిశ్రమలను కూడా ఆయన విజయవంతంగా ముందుకు నడిపారు. అయితే 1954 లోనే ఆయన ఓల్డ్ మాంక్ సంస్థను నెలకొల్పి ప్రభంజనం సృష్టించారు. కొన్నేళ్ల పాటు దేశం మొత్తంలో అత్యధికంగా అమ్ముడుపోయిన బ్రాండ్ గా చరిత్ర సృష్టించింది. ఇక ఈయన చైర్మన్ గా వున్నపుడే మోహన్ మేకిన్ లిమిటెడ్ సంస్థ నుండి  సోలాన్‌ నెం.1, గోల్డెన్ ఈగ‌ల్ వంటి మ‌రో రెండు బ్రాండుల‌ు కూడా సృష్టింపబడ్డాయి. అయితే, వోల్డ్ మాంక్ రమ్ భారతదేశంలోనే బెస్ట్ రమ్ గా పేరుపొందింది. వోల్డ్ మాంక్ మద్య ప్రియులకు ఒక లెజెండ్గా మారిపోయింది.  జనరల్ నుంచి జవాన్ దాకా, పండితులనుంచిపామరుల దాకా అంతా వోల్డ్ మాంక్ తో ప్రభావితులవుతూ వస్తున్నారు. చవగ్గా, చక్కగా, ఆంతఘాటుగా లేకుండా ఉల్లాస పరిచే డ్రింక్ గా వోల్డ్ మాంక్ పేరొచ్చింది. వోల్డ్ మాంక్ మీద వచ్చిన మద్య సాహిత్యం మరొక బ్రాండ్ మీద లేదేమో.  వోల్డ్ మాంక్ తో తమకున్న అనుబంధం గురించి రాయని రచయిత లేడేమో. గ్లోబలైజేషన్ వచ్చినా వోల్డ్ మాంక్ తన పద్థతుల్లోనే ఉంటూండటం పల్ల క్రమంగా మార్కెట్ కోల్పోతూ ఉందని, చివరకు అంతరించిపోతుందేమోనని కొన్ని వేల మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ లలో వోల్డ్ మాంక్ దొరక్కపోవడం చాలా అభిమానులను నిరాశకు గురిచేస్తూ ఉంది. అందుకే కర్నాటక నుంచి మద్య ప్రియులు తెలుగు రాష్ట్రాల్లోని తమ స్నేహితులకు వోల్డ్ మాంక్ కానుకగా తీసుకురావడం మొదలయింది... ఇదంతా మరొక విషాదం.

 తన వ్యాపార సామ్రాజ్యాన్ని అత్యంత విజయవంతంగా నడిపిన ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2010లో ప‌ద్మ‌శ్రీ పురస్కారంతో స‌త్క‌రించింది. అయితే గత కొంత కాలంగా మోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండె పోటు వచ్చి మృతి చెందారు.   

loader