హైదరాబాద్ పాతబస్తిలో ఓ వ్యక్తి కత్తులతో దాడులు చేస్తూ హల్ చల్ సృష్టించాడు. బహదూర్ పురా ప్రాంతంలో చిన్న విషయంపై చెలరేగిన వివాదంలో ముగ్గురు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 

పాతబస్తీ బహదుర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మజీద్ ముందు నూర్ ముల్లా అనే వ్యక్తి పావురాలకు దాణా వేస్తున్నాడు. అయితే ఇక్కడ పావురాలకు దాణా వేయవద్దని నాసిర్ అనే ఇమాం అతడికి సూచించాడు. అయితే ఇలా హెచ్చరించడంపై  కోపోద్రిక్తుడైన నూర్ నాసిర్ పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిని అడ్డుకోడానికి ప్రయత్నించిన దస్తగిరి, మౌజంలపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో ఇమాం నాసిర్ తీవ్ర గాయాలవగా మిగతా ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. 

ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ ముగ్గురిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన మజీద్ కోసం గాలిస్తున్నారు.