Asianet News TeluguAsianet News Telugu

రెండు వేల నోటు పై భ‌యం వ‌ద్దు

  • రూ.2000 నోట్ల పై కేంద్ర క్లారిటీ.
  • రద్దు లేదని తెల్చింది.
  • రూ.200 నోట్లను త్వరలో ప్రవేశ పెడతాం
no doubht we are not ban rs 2000 note

 

దేశంలో నోట్ల ర‌ద్దు త‌రువాత కొత్త‌గా తీసుకొచ్చిన రూ.2000 నోటు ను ర‌ద్దు చేస్తున్నార‌ని ప్ర‌చారం బాగా జ‌రుగుతంది. గ‌త రెండు వారాలుగా రూ.2000 నోటు ను ర‌ద్దు చేస్తున్నార‌ని, వాట్స్‌యాప్‌, ట్విట్ట‌ర్‌, ఫేస్‌బుక్ లాంటి సోష‌ల్ మాద్య‌మాల‌ల్లో బాగా ప్ర‌చారం జ‌రుగ‌తుంది. దీంతో ప్ర‌జ‌లు కొంత ఆందోళ‌న‌తో ఉన్నారు. త‌మ వ‌ద్ద ఉన్న రూ.2000 నోట్ల‌ను మార్చ‌కోవ‌డానికి మ‌ళ్లీ బ్యాంక్‌ల చుట్టు తిర‌గాలా... అనే సంధిగ్థ‌తో ఉన్నారు.

రూ.2000 నోట్ల ర‌ద్దు లేదు.

రూ. 2000 నోటు రద్దు అంశంపై కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి సంతోష్‌ అగర్వాల్ వివరణ ఇచ్చారు. 2 వేల నోట్లను రద్దు చేస్తున్నారన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అవి కేవ‌లం పుకార్లు మాత్ర‌మే అని, దేశ ప్ర‌జ‌లు ఇలాంటి ఫేక్ వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆయ‌న తెలిపారు. రూ. 2000 నోట్లు కొన‌సాగుతాయ‌ని, కేంద్రం ర‌ద్దు గురించి ఆలోచ‌న చెయ్య‌డం లేద‌ని తెలిపారు.

రూ.200 నోట్ల ప్ర‌వేశం.

ఆర్బీఐ త్వ‌ర‌లో రూ. 200 నోట్లను ప్రవేశ పెట్టబోతున్నామని, ఇప్ప‌టికే కేంద్ర నుండి రిజ‌ర్వూ బ్యాంక్ కి ఆదేశాలు వెళ్లాయని ఆయన తెలిపారు

Follow Us:
Download App:
  • android
  • ios