ఎంపి కవితకు మరో అరుదైన గౌరవం

First Published 20, Nov 2017, 6:32 PM IST
nizamabad mp kavitha elected as a telangana body building association chairman
Highlights
  • నిజామాబాద్ ఎంపి కవితకు మరో గౌరవం
  • తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కీలక నిర్ణయం

నిజామాబాద్ ఎంపి,తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాల లో తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిన్న సమావేశమై ఈ మేరకు తీర్మానించింది. 
ఇప్పటికే కవిత తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ అద్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ఆమె నాయకత్వంలో ఈ సంఘం పేరు ప్రతిష్టలు పెరిగాయని, అందువల్ల ఆమెకు చైర్మన్ గా అవకాశం కల్పించినట్లు ఎగ్జిక్యూటివ్ కమిటీ తెలిపింది. ఆమె సేవలు పూర్తిగా వినియోగించుకుని ఈ అసోసియేషన్ ను అభివృద్ది చేయనున్నట్లు వారు తెలిపారు.
ఇక ఈ సంఘానికి చెందిన మిగతా పదవులను కూడా భర్తీచేశారు. అందులో రాష్ట్ర అధ్యక్షులుగా తెలంగాణ జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కోరబోయిన విజయ్ కుమార్, న్యాయ సలహా దారుగా ఆర్.మహదేవన్ ఎన్నికయ్యారు. ఇక ఈ సంఘము గౌరవ కార్యదర్శి మోహన్ రావు తో పాటు మిగతా కార్యవర్గం యధావిధిగా కొనసాగుతోంది.

loader