తెలుగు రాష్ట్రాలకు వర్షాలు ఈశాన్య  బంగాళఖాతంలో  ఉపరితల ఆవర్తనం సాధారణ వర్షపాతం నమోదు

తెలుగు రాష్ట్రాల‌కు తిరిగి వ‌ర్షాలు ప్రారంభం కానున్నాయి. రానున్న‌ 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ప‌లు చోట్ల సాధార‌ణ వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 బంగాళాఖాతంలో ఏర్పడిన ఈశాన్య‌ ఉపరితల ఆవర్తనం నిన్న సాయంత్రానికి వాయవ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఆదివారంకల్లా అక్కడే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని శాఖ పేర్కొంది. దీంతో కోస్తా, తెలంగాణలో ప‌లు జిల్లాల్లో సోమవారం నుంచి వర్షాలు కురుస్తాయనియ తెలిపింది. ఈ ప్రభావం ఆంధ్ర‌లో క‌న్న తెలంగాణ‌లో కాస్తా అధికంగా ఉండ‌నుంది.